కార్తికమాసం.. దర్శనీయ శైవక్షేత్రాలు

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో చాలా ప్రసిద్ధి. కరీంనగర్‌కు సమీపంలో ఉంటుంది. ధర్మగుండంలో స్నానం చేసి కోడెమొక్కు చెల్లించడం ఇక్కడ ప్రత్యేకం.

Image: Google

ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షరామంలోని భీమేశ్వర ఆలయం సుప్రసిద్ధమైనది. 26 మీటర్ల లింగం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో రెండు అంతస్తులుంటాయి.

Image: RKC

శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నిత్యం భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.

Image: RKC

గద్వాల జోగులాంబ జిల్లాలోని అలంపూర్‌లో తుంగభద్ర తీరంలో దక్షిణ కాశీగా పిలిచే బాల బ్రహ్మేశ్వర ఆలయముంది. ఇక్కడి బ్రహ్మ ఆలయాల్లో శివుడికి పూజలు చేస్తారు. 

Image: Google

కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి తీరంలో కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ రెండు శివలింగాలుంటాయి. ముక్తేశ్వర లింగానికి రెండు నాశికారంధ్రాలుంటాయి. అందులో ఎంత నీరు పోసినా బయటకు రావు.

Image: RKC

గుంటూరుకు సమీపంలోని అమరావతిలో పంచారామ అమరలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ బౌద్దమతం పరంగా ప్రసిద్ధి పొందింది. శివలింగం 15 అడుగుల ఎత్తు ఉంటుంది.

Image: RKC

ప్రకాశం జిల్లా కొత్తపల్లికి సమీపంలో ఉన్న బైరవకోనలో ఒకే శిలతో ఎనిమిది శివాలయాలను నిర్మించారు. 8 రూపాల్లో శివుడు దర్శనమిస్తాడు. చుట్టూ కోనేరులుంటాయి.

Image: Google

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం శ్రీకాళహస్తిలో స్వయంభుగా శివుడు వెలిశాడు.ఇక్కడ శివుడు వాయురూపంలో ఉంటారని ప్రతీతి. ఇది తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉంటుంది.

Image: Google

గుంటూరు జిల్లాలోని నరసరావుపేటకు సమీపంలో కోటప్పకొండ క్షేత్రం ఉంది. దక్షిణామూర్తి రూపానికి ఏకైక ఆలయమిది. ఇక్కడున్న బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలపై శివాలయాలుంటాయి.

Image: RKC

సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలో ప్రసిద్ధిగాంచింది. మల్లికార్జున స్వామి విగ్రహం పుట్టమన్నుతో రూపుదిద్దుకుంది.

Image: RKC 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పాలంపేట సమీపంలోని రామప్పలో రామలింగేశ్వర ఆలయం ఉంది. ఇది శిల్పకళకు నెలవు. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపూ లభించింది.

Image: RKC

మే 23.. బుద్ధపౌర్ణిమ

మే 21 వరల్డ్‌ మెడిటేషన్‌ డే

వృత్తి జీవనానికి చాణక్య నీతులు

Eenadu.net Home