ఊరగాయలందు విదేశీ ఊరగాయలు వేరయా!

మామిడి, నిమ్మకాయ, ఉసిరి వంటి పచ్చళ్లకు తెలుగు రాష్ట్రాలు ఫేమస్‌. మరి విదేశాల్లో పచ్చళ్లు ఎలా చేసుకుంటారో తెలుసా?

Image: RKC

జర్మనీలో క్యాబేజీతో ఊరగాయను చేసుకుంటారు. క్యాబేజీని తురిమి సీసాల్లో నిల్వ చేస్తారు. దీన్ని ‘సార్‌క్రాట్‌’ అని పిలుస్తారక్కడ.

Image: RKC

దక్షిణ కొరియాలో క్యాబేజీతో ముల్లంగిని కలిపి నిల్వ చేస్తారు. దీన్నే ‘కిమ్చీ’ అంటారు.

Image: RKC

మొరాకో ప్రజలకు నిమ్మకాయ పచ్చడంటే ప్రాణం. మనలా కాకుండా కేవలం ఉప్పు, నిమ్మకాయలను జాడీలో వేసి నిల్వ చేస్తారు. ఈ ఊరగాయని ‘బౌసెరా’అని పిలుస్తారు.

Image: RKC

జపాన్‌లో కీరదోస ముక్కలను వెనిగర్‌లో నానబెట్టి నిల్వ చేసుకుంటారు. దానినే ఊరగాయగా వాడతారు. ఈ పచ్చడి పేరు ‘సునోమోనో’. 

Image: RKC

ఇటలీలో కొన్ని రకాల కూరగాయలతో వెల్లుల్లి, ఉల్లిని కలిపి వెనిగర్‌లో వేసి ఊరనిస్తారు. పాస్తా, మాంసాహారంలో సైడ్‌ డిష్‌గా తింటారు. ఈ పచ్చడిని‘జియార్డినెరా’అంటారు. 

Image: RKC

ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాల్లో ‘టోర్షి’ అని పిలిచే పచ్చడిని ఎక్కువగా తింటారు. దీన్ని టుర్నిప్‌ అనే దుంప లేదా వివిధ కూరగాయాలతో తయారు చేస్తారు. 

Image: RKC

స్వీడన్‌లో చేప ముక్కలకు కూరగాయలు, మసాలా దినుసులు, వెనిగర్‌ కలిపి జాడీలో పెడతారు. దీన్ని వారు పికిల్డ్‌ హెర్రింగ్‌ అంటారట. 

Image: RKC

అమెరికా, ఫ్రాన్స్‌లో ‘గెర్కిన్స్‌’ అనే కీర దోస లాంటి వాటిని ఆలివ్‌ నూనెలో వేసి ఉంచుతారు.

Image: RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home