దేశంలోని ప్రముఖ రామాలయాలివీ..!

అయోధ్య రామ మందిర్‌

అయోధ్యను రామ జన్మభూమిగా పండితులు పేర్కొంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య రామమందిరం హిందువులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రస్తుతం కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 

Image: Google Map

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం

తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉందీ రామాలయం. దీన్ని భక్త రామదాసు నిర్మించారు. ఏటా శ్రీరామ నవమి రోజున దేవాలయం వెలుపల బహిరంగ వేదికపై సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తుంటారు.

Image: Google Map

రఘునాథ ఆలయం 

జమ్ముకశ్మీర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని 1822 - 1860 మధ్య నిర్మించారు. గర్భగుడి గోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దారు. ఈ గుడి పరిసర ప్రాంతాల్లో రామాయణంలో ఉన్న మహనీయులందరీ ఆలయాలు కనిపిస్తాయి.

Image: Google Map

రామరాజ ఆలయం

మధ్యప్రదేశ్‌లోని ఓర్చా ప్రాంతంలో ఉందీ ఆలయం. ఇక్కడి రాముడిని స్థానికులు దేవుడిగా కాకుండా రాజుగా మాత్రమే పూజిస్తారు. కోట రూపంలో నిర్మించిన ఈ గుడికి పోలీసులు కాపలా కాస్తుంటారు. ప్రతి రోజు రాజుకు సైనిక వందనం చేస్తుంటారు. 

Image: Google Map

కోదండరామ ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం పురాతనమైనది. చోళ, విజయనగర రాజుల కాలంలో దీన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. మహాభాగవతాన్ని తెలుగులో రాసిన బమ్మెర పోతన ఒంటిమిట్టలోనే నివసించారట. 

Image: Google Map

తిరువంగడ్‌ శ్రీరామస్వామి ఆలయం

కేరళలోని తలసెర్రీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఆలయం పైకప్పు అంతా రాగితో ఏర్పాటు చేశారు. 

Image: Google Map

రామస్వామి ఆలయం

తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ఈ ఆలయం దక్షణాదిలో అత్యంత ప్రసిద్ధి చెందిన అందమైన దేవాలయం. ఇక్కడి ఆలయంలో లక్ష్మణ, భరత, శతృఘ్నుడు, హనుమంతుడి ప్రతిమలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Image: Google Map

కలరం మందిర్‌

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఉన్న పంచవటి ప్రాంతంలో ఉంది. ఇక్కడ 2 అడుగుల ఎత్తు నల్లరాయి రాముడి విగ్రహం ఉంటుంది. సీతారామలక్ష్మణులు వివిధ ప్రాంతాల్లో పదేళ్ల వనవాసం పూర్తి చేసి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారని చెబుతుంటారు. 

Image: Google Map

హజర రామాలయం

కర్ణాటకలోని హంపీలో ఉన్న హజర రామాలయం ఎంతో అందంగా ఉంటుంది. విజయనగర రాజులు, వారి కుటుంబాల కోసం నిర్మించుకున్న ప్రత్యేక వ్యక్తిగత ఆలయమిది. రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ గుడిలో చెక్కబడి ఉన్నాయి.

Image: Google Map

రామ్‌టెక్‌

వనవాసం సమయంలో శ్రీరాముడు మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న రామ్‌టెక్‌లో కొన్నాళ్లు నివసించారట. అందుకే, ఇక్కడ 18వ శతాబ్దంలో రామ్‌టెక్‌ పేరుతో రాముడికి గుడి నిర్మించారు. కాళిదాసు ఇక్కడి కొండలపై కూర్చొనే ‘మేఘదూత’ని రాసినట్టు స్థానికుల విశ్వాసం.  

Image: Google Map

ఏప్రిల్‌ 21.. మహావీర్ జయంతి

ఈ వారం రాశిఫలం

నూతన సంవత్సరం ఒక్కో చోట ఒక్కోలా..

Eenadu.net Home