దేశంలోని ప్రముఖ కృష్ణ మందిరాలివే!

ద్వారకాధీశ్‌ (గుజరాత్‌)


గుజరాత్‌లోని గోమతి నదీ తీరంలో 2,500 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

Image: Eenadu

గురువాయూర్‌ కృష్ణ మందిర్‌ (కేరళ)


ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం, దక్షిణ ద్వారకగా పిలుస్తుంటారు. 5వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో కృష్ణ భగవానుడు.. విష్ణు రూపంలో దర్శనమిస్తాడు.

Image: Google

ఉడిపి శ్రీకృష్ణమఠ్‌ (కర్ణాటక)


కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పట్టణంలో ఉంది. ఈ ఆలయాన్ని కొందరు భక్తులు సందర్శించడానికి వస్తే.. మరికొందరు ఈ మఠంలోనే ఉండిపోతుంటారట. 13వ శతాబ్దంలో జగద్గురు మధ్వాచార్య ఈ ఆలయాన్ని నిర్మించారు.

Image: Google

జుగల్‌ కిశోర్‌ ఆలయం (యూపీ)


ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరంలో ఉన్న జుగల్‌ కిశోర్‌ ఆలయంలోనూ శ్రీకృష్ణుడు పూజలందుకుంటున్నాడు. కొన్ని ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు.

Image: Google

పూరీ జగన్నాథ్‌ (ఒడిశా)


ఒడిశాలోని పూరీలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా కొలువై ఉన్నాడు. గర్భగుడిలో జగన్నాథ్, బలభద్ర, సుభద్ర విగ్రహాలుంటాయి. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు.

Image: Eenadu

గోవింద్‌దేవ్‌జీ ఆలయం (రాజస్థాన్‌)


రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక రోజుల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే సమయంలో ఎలా ఉన్నాడో ఇక్కడి విగ్రహం అలాగే ఉంటుందట.

Image: Google

రాజగోపాలస్వామి ఆలయం (తమిళనాడు)


తమిళనాడులోని మన్నర్‌గుడిలో ఉందీ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడు రాజగోపాలస్వామి రూపంలో దర్శనమిస్తాడు. 23 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయం అతి పురాతనమైనది.

Image: Google

ప్రేమ్‌ మందిర్‌ (యూపీ)


ఉత్తరప్రదేశ్‌లోని బృందావనం నగరంలో ఉన్న ఈ ఆలయంలో కృష్ణుడు రాధా సమేతంగా కొలువై ఉన్నాడు. 2012లో ఆలయం ప్రారంభమైంది.

Image: Eenadu

ఇస్కాన్‌


ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌ (ఇస్కాన్‌) సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక శ్రీకృష్ణుడి ఆలయాలను నిర్మించింది. భారత్‌లో దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఇస్కాన్‌ ఆలయాలున్నాయి.

Image: Eenadu

ఆషాఢంలోనే ఇన్ని నియమాలు ఎందుకు పాటిస్తారు..?

జగన్నాథుడి రథయాత్ర విశేషాలివీ!

అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలివీ..

Eenadu.net Home