ఏఐ మాయ.. ఇవీ వర్చువల్‌ అందాలు!

లూ డో మేగలా

బ్రెజిల్‌కు చెందిన ఈ వర్చువల్ ఇన్‌ఫ్లూయన్సర్‌కు ఇన్‌స్టాలో 6.2 మిలియన్‌ ఫాలోవర్లున్నారు. అన్ని రకాల వస్తువులకు మేగలా రివ్యూలు ఇస్తుంటుంది. అన్‌బాక్సింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టిప్స్‌ వంటి వీడియోలు రూపొందిస్తుంటుంది. 

Image: Instagram/magazineluiza

లిల్‌ మైఖేలా

లాస్‌ ఏంజిలెస్‌కు చెందిన ఓస్టార్టప్‌ సంస్థ రూపొందించిన బ్రెజిలియన్‌-అమెరికన్‌ ఏఐ బ్యూటీ ఇది. ఇన్‌స్టాలో 2.8 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌కు మోడల్‌గా పనిచేస్తోంది. 2017లో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లోనూ మెరిసింది.

Image: Instagram/lilmiquela

బార్బీ

ఆడపిల్లలు ఎంతో ఇష్టపడే బార్బీ బొమ్మను కూడా వర్చువల్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌గా మార్చేశారు. ఇన్‌స్టాలో ఏఐ బార్బీని 2.2 మిలియన్‌ ఫాలో అవుతున్నారు. వ్లాగర్స్‌లాగే ఈ బార్బీ కూడా వ్లాగ్స్‌ చేస్తూ ఉంటుంది. 

Image: Instagram/barbie

ఎనీమలు

బ్రెజిల్‌కు చెందిన ఈ వర్చువల్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ను ఇన్‌స్టాలో 5.39లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎనీమలు సొంతగా టీవీ షో నిర్వహిస్తోంది. వాణిజ్యపరంగా బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేస్తుంటుంది. 

Image: Instagram/anymalu_real

తలస్య

ఇండోనేషియాకి చెందిన ఈ ఏఐ సుందరి.. ప్రపంచాన్ని చుట్టేస్తూ ఆయా ప్రాంతాల్లో ఫొటోలు దిగినట్టుగా ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. తన అభిప్రాయాల్ని చెబుతుంది. ఇన్‌స్టాలో తలస్యకు 4.67లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/thalasya

నోనౌరీ

జర్మనీకి చెందిన 19 ఏళ్ల ఈ వర్చువల్‌ చిన్నది.. ఫ్యాషన్‌ రంగంలో ఓ తుపాను. పలు బ్రాండ్స్‌కు సంబంధించిన దుస్తులు, సౌందర్యసాధనాలను ప్రమోట్‌ చేస్తుంటుంది. ఈ ఖాతాకు 4లక్షల మంది ఫాలోవర్లున్నారు. 

Image: Instagram/noonoouri

ఇమ్మాగ్రామ్‌

జపాన్‌కు చెందిన వర్చువల్‌ డిజిటల్‌ క్రియేటర్‌. రకరకాల వీడియోలు, ఫొటోలు తీస్తూ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. ఈ ఖాతాను 4లక్షల మంది అనుసరిస్తున్నారు. 

Image: Instagram/imma.gram

బెర్ముడా

లాస్‌ ఏంజిలెస్‌కు చెందిన బెర్ముడా రోబో క్వీన్‌గా గుర్తింపు పొందింది. తన వర్చువల్‌ అందాలతో ఆకట్టుకుంటోంది. ఈ ఏఐ సుందరికి 2.5లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/Bermuda

కైరా

భారత్‌కు చెందిన తొలి వర్చువల్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌. ముంబయికి చెందిన కైరా.. ట్రావెలర్‌, మోడల్‌. ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కైరాను 2.16లక్షల మంది ఫాలో అవుతున్నారు. 

Image: Instagram/kyraonig

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home