ఈ హీరోయిన్లకు గుడి కట్టారు తెలుసా..?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన సందీప్‌ వీరాభిమాని. సమంతపై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలోనే ఆమెకు గుడి నిర్మించాడు. సామ్‌కే కాదు.. గతంలో మరికొందరు హీరోయిన్లకూ వారి అభిమానులు గుళ్లు కట్టారు. ఎవరెవరికంటే...

Image: Instagram

కుష్బూ సుందర్‌

కుష్బూ.. 90వ దశకంలో అటు తమిళ్‌, ఇటు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. దీంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. వారిలో కొందరు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కుష్బూకి గుడి కట్టారు.

Image: Instagram

నమిత

‘సొంతం’, ‘జెమిని’, ‘సింహా’ తదితర సినిమాలతో తెలుగువారికి దగ్గరైన నమితకు.. కోలీవుడ్‌లో భారీ అభిమానగణమే ఉంది. అందుకే, ఈమెకు తమిళనాడులోని కోయంబత్తూర్‌, తిరునవెల్లి, మరో చోట మొత్తం మూడు ఆలయాలు నిర్మించారు.

Image: Instagram

హన్సిక

టాలీవుడ్‌లో తొలి చిత్రం‘దేశముదురు’తోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది హన్సిక. కోలీవుడ్‌లోనూ చాలా సినిమాల్లో నటించింది. హన్సికపై అభిమానంతో కొందరు చెన్నై శివారులో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయం నిర్మించారు.

Image: Instagram

నిధి అగర్వాల్‌

యంగ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌కు తమిళనాడులో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు చెన్నైలో ఆమె విగ్రహం తయారు చేసి గుడి కట్టారు. 

Image: Instagram

నగ్మా

నగ్మా.. 90వ దశకంలో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగింది. బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల ఆమెకు ఆలయాలు నిర్మించారు. కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి.

Image: Instagram

పూజా ఉమాశంకర్‌

ఇండో-శ్రీలంక నటి పూజా ఉమాశంకర్‌ ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించింది. ‘ఆరెంజ్‌’లో అతిథి పాత్ర పోషించింది. ఈమెకు శ్రీలంకలోని కొలంబోలో అభిమానులంతా ఓ గుడి కట్టారు.

Image: Instagram

కాజల్‌ అగర్వాల్‌

కాజల్‌ అగర్వాల్‌ నటించిన ఓ సినిమా కోసం తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఆలయం సెట్‌ వేయగా.. అందులో కొందరు అభిమానులు కాజల్‌కి గుడి నిర్మించబోయారు. కాజల్‌ వారించడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

Image: Instagram

నయనతార

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన హీరోయిన్‌ నయనతారకు హీరోలకు ఉన్నంత ఫ్యాన్‌డమ్‌ ఉంది. ఆమె కోసం ఓ గుడి కట్టాలని అభిమానులు నిర్ణయించుకోగా.. నయన్‌ దానికి నిరాకరించారు.

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home