గ్లామర్‌ గన్ను పడితే... ఫరియా

‘ఆ ఒక్కటీ అడక్కు’తో హిట్‌ అందుకున్న ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు ‘మత్తు వదలరా’తో వస్తోంది.

సెప్టెంబరు 13న రానున్న ‘మత్తు వదలరా 2’తో ప్రేక్షకులను అలరించేందుకు ఫరియా సిద్ధమైంది. 

సినిమాలోని ఫరియా లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. గన్‌ పట్టుకొని ఆమె ఇచ్చిన పోజు ఇప్పుడు వైరల్‌గా మారింది. 

 ‘జాతి రత్నాలు’లో చిట్టిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫరియా.. ‘వల్లి మైయిల్‌’తో తమిళంలో ఎంట్రీ ఇవ్వనుంది.

‘ద జెంగాబురు కర్స్‌’ అనే వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ ఫరియా అడుగుపెట్టింది.

‘బంగార్రాజు’లో ‘నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు..’ అంటూ ఫరియా చేసిన స్పెషల్‌ సాంగ్‌ హిట్టే! 

 ‘కల్కి 2898 ఏడీ’లో కాంప్లెక్స్‌లో ఓ పాటలో కాసేపు అందంగా డ్యాన్స్‌ చేసి అలరించింది.  

This browser does not support the video element.

ఇన్‌స్టాలో ఫరియాను అన్‌స్టాపబుల్‌ అనే చెప్పాలి. ట్రెండీ పాటలకు రీల్స్‌ చేస్తూ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.

‘మీ బాడీ మీతో కమ్యూనికేట్‌ అవుతుంది. ఆ రిమైండర్‌ని గమనించాలి. అది చాలా అవసరం’ అంటూ జీవిత పాఠాలు కూడా చెబుతోంది. 

రిఫ్రెష్‌ అవ్వడానికి తరచూ విహారయాత్రల్లో పాల్గొంటుంది. చిన్న పిల్లలా అన్నింటినీ మరచిపోయి ప్రకృతిలో ఆడుకోవడం బాగా ఇష్టమట.

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home