‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రయిబ్‌’ అంటోన్న ‘చిట్టి’

‘జాతి రత్నాలు’తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించిన ఫరియా అబ్దుల్లా.. ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రయిబ్‌’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Image:Instagram

సంతోష్‌ శోభన్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫరియా హీరోయిన్‌గా నటిస్తోంది.

Image:Instagram

‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రయిబ్‌’లో ఆమెకు సంబంధించిన ఓ అందమైన స్టిల్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు..

Image:Instagram

ఈమె 1998 మే 28న హైదరాబాద్‌లో జన్మించింది. లయోలా కాలేజీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Image:Instagram

ఆమె చదివిన కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శక నిర్మాత నాగ్‌ అశ్విన్‌ దృష్టిలో పడింది. అలా.. ‘జాతి రత్నాలు’ అవకాశం దక్కించుకుంది.

Image:Instagram

స్కూల్‌ డేస్‌లో ఏటా సమ్మర్‌ క్యాంపులకు హాజరవుతూ యాక్టింగ్‌, పెయింటింగ్‌, డ్యాన్స్‌ నేర్చుకుందట. అలా ఫరియాకు నటనపై ఆసక్తి పెరిగింది.

Image:Instagram

ఫరియా మంచి డ్యాన్సర్‌. హిప్‌ హాప్‌, బెల్లీ డ్యాన్స్‌, ఫ్రీ స్టయిల్‌ డ్యాన్సింగ్‌ లాంటి పాశ్చాత్య నృత్యాలతోపాటు కథక్‌ కూడా నేర్చుకుంది. అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌, కవిత్వం కూడా తనకు చాలా ఇష్టం.

Image:Instagram

విజయ్‌ దేవరకొండతో నటించాలనుందని ఓ సారి తన మనసులోని మాటని బయటపెట్టింది. తనకు నచ్చిన నటుడు ఫహద్‌ ఫాజిల్‌ అని చెప్పింది.

Image:Instagram

ప్రస్తుతం విజయ్‌ ఆంటోని హీరోగా తెరకెక్కుతోన్న ‘వల్లి మయిల్‌’, రవితేజ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘రావణాసుర’లో ఫరియా నటిస్తోంది.

Image:Instagram

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home