బంతులు కావు.. నిప్పుకణికలు!

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని జట్లలో ఫాస్ట్‌ బౌలర్లున్నారు. కానీ, వారిలో గంటకు 150కి.మీ మించిన వేగంతో బౌలింగ్‌ చేసే ఆటగాళ్లు అరుదు. తాజాగా భారత బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అత్యంత వేగంతో బంతి వేసి ఇండియన్‌ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు.

Image: Instagram

ఉమ్రాన్‌ మాలిక్‌ (156kph)

శ్రీలంకతో తాజాగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఉమ్రాన్‌.. గంటకు 156 కి.మీ వేగంతో బంతి విసిరి రికార్డు సృష్టించాడు. జనవరి 3న అదే జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 155/kph వేగంతో బౌలింగ్‌ చేశాడు. ఆ వేగంతో బంతులు వేసిన తొలి భారతీయ బౌలర్‌ ఉమ్రానే.

Image: Instagram

ఇర్ఫాన్‌ పఠాన్‌ (153.7kph)

టీ20 ప్రపంచకప్‌-2007లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ గంటకు 153.7 కి.మీ వేగంతో బంతి వేశాడు. ఆ ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

Image: RKC

మహమ్మద్‌ షమి (153.3kph)

భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో 2014లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో షమి గంటకు 153.3 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. 

Image: RKC

జస్ప్రీత్‌ బుమ్రా (153.2kph)

టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన బుమ్రా.. తన కెరీర్‌లో అత్యంత వేగమైన బంతిని 2018లో విసిరాడు. బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా గంటకు 153.2 స్పీడ్‌తో బౌలింగ్‌ చేశాడు. 

Image: RKC

ఇషాంత్‌ శర్మ (152.6kph)

ఇషాంత్‌.. 2008లో కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 152.6 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేశాడు.

Image: RKC

వరుణ్‌ ఆరోన్‌ (152.5kph)

వరుణ్‌ ఆరోన్‌ భారత్‌ తరఫున ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా.. బౌలర్‌గా సత్తా చాటాడు. 2014లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో గంటకు 152.5 కి.మీ వేగంతో బంతి వేసి ఆశ్చర్యపర్చాడు.

Image: RKC

ఉమేశ్‌ యాదవ్‌ (152.5kph)

2014లో శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ గంటకు 152.5 వేగంతో బంతిని విసిరాడు.

Image: RKC

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంతో బౌలింగ్‌ చేసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానం ఇప్పటికీ పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరు మీదే ఉంది. ఈ పాక్‌ దిగ్గజ బౌలర్‌ 2003లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3కి.మీ వేగంతో బౌల్‌ చేశాడు. 

Image: RKC

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home