వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు!
ఐడెన్ మార్‌క్రమ్
తాజా వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్ చరిత్ర సృష్టించాడు. అతి తక్కువ బంతుల్లో(49) సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు బద్దలుకొట్టాడు.
కెవిన్ ఓబ్రియన్
మార్‌క్రమ్ కంటే ముందు వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఐర్లాండ్‌కి చెందిన కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. 2011లో ఇంగ్లాండ్‌పై 50 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉన్నాడు. 2015లో శ్రీలంకపై 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
ఏబీ డివిలియర్స్
మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో 52 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు.
ఇయాన్ మోర్గాన్
2019లో అఫ్గానిస్థాన్‌పై ఇయాన్ మోర్గాన్ 57 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని ఐదో ప్లేస్‌లో ఉన్నాడు. 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు.
మాథ్యూ హేడెన్
ఆరో వేగవంతమైన సెంచరీ ఆసీస్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పేరిట ఉంది. 2007లో సౌతాఫ్రికాపై 66 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
జాన్ డేవిసన్
2003 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కెనడా ఆల్‌రౌండర్ జాన్ డేవిసన్ 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచకప్‌లో ఇది ఏడో ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. అతడి కెరీర్‌లో ఏకైక శతకం.
కుమార సంగక్కర
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కర 2015లో ఇంగ్లాండ్‌పై 70 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ సెంచరీ.
పాల్ స్టిర్లింగ్
ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ 2011 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై 70 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇది తొమ్మిదో ఫాస్టెస్ట్ సెంచరీ.
కపిల్ దేవ్
1983లో భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్‌దేవ్ ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు. 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడీ హరియాణా హరికేన్.