టెక్నో ఫాంటమ్‌ ఎక్స్‌ 2 - 5జీ.. ఫీచర్లివే!

గత డిసెంబర్‌లో సౌదీ అరేబియాలో విడుదలైన టెక్నో ఫాంటమ్‌ ఎక్స్‌ 2 మొబైల్‌.. తాజాగా భారత మార్కెట్లోకి వచ్చింది.

Image: Tecno

ఈ 5జీ మొబైల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: Tecno

దీంట్లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌, మాలి-జీ710 ఎంసీ 10 జీపీయూ వాడారు. 

Image: Tecno

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత హాయ్‌ ఓఎస్‌ 12.0తో పనిచేసే ఈ డివైజ్‌లో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. 

Image: Tecno

వెనుకభాగంలో 64 + 13 + 2 ఎంపీ కెమెరాలు, ముందువైపు 32 ఎంపీ కెమెరాలు అమర్చారు.

Image: Tecno

ఇందులో 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 20 నిమిషాల్లో 50శాతం ఛార్జ్‌ అవుతుందని సంస్థ చెబుతోంది.

Image: Tecno

మొబైల్‌లోనే డీఫాల్ట్‌గా ట్రాన్స్‌లేటర్‌, మొబైల్‌ డాక్యుమెంట్‌ స్కానర్‌, ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌, స్మార్ట్‌కార్డ్స్‌ ఫీచర్లున్నాయి. 

Image: Tecno

మూన్‌లైట్‌ సిల్వర్‌ , స్టార్‌డస్ట్‌ గ్రే రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 39,999. జనవరి 9 నుంచి అమెజాన్‌లో విక్రయాలు మొదలవుతాయి. ప్రీ బుకింగ్‌ వెసులుబాటు ఉంది. 

Image: Tecno

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home