ఈ ఆర్థిక పాఠాలు.. సంతోషకర జీవితానికి సోపానాలు!

ఖర్చు


సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టొద్దు. వచ్చిన ఆదాయంలో కొంత డబ్బును దాచుకొని మిగతా మొత్తాన్ని నెలవారీ ఖర్చులకు కేటాయించాలి.

Image: Eenadu

ఆర్థిక ప్రణాళిక


ఆదాయం, ఖర్చులతో ఇంటి నెలవారీ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారమే ఖర్చు పెట్టాలి.. పొదుపు చేయాలి.

Image: Eenadu

అప్పు


చేబదులుగా తీసుకున్నా అప్పు అప్పే. దాన్ని తిరిగి చెల్లించగలిగే వీలు ఉన్నప్పుడే అప్పులు చేయండి. ఎంత తక్కువ అప్పు ఉంటే అంత ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది.

Image: Eenadu

పెట్టుబడి


వచ్చిన ఆదాయంతో మరింత సంపద సృష్టిస్తేనే భవిష్యత్తులో ఢోకా ఉండదు. అందుకు మీరు క్రమం తప్పకుండా మంచి రాబడి ఇచ్చే షేర్లు, ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.

Image: Eenadu

రుణాలు


రుణాలకు సంబంధించి ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి. లేదంటే ఆ ప్రభావం మీ క్రెడిట్‌ స్కోరుపై పడి భవిష్యత్తు లోన్స్‌కు ఇబ్బందిగా మారే అవకాశముంది.

Image: Eenadu

అత్యవసర నిధి


ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే, అనుకోని ఖర్చుల కోసం కనీసం ఆరు నెలలకు సరిపడా నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

Image: Eenadu

బీమా


సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైన జరిగితే కుటుంబసభ్యులు రోడ్డునపడతారు. అలా జరగకుండా ఉండాలంటే.. జీవిత, ఆరోగ్య బీమాలు తప్పకుండా తీసుకోవాలి. ఆ వ్యక్తి అనారోగ్యానికి గురైతే ఆర్థిక భారం పడదు. మరణిస్తే ఆ బీమా డబ్బు కుటుంబానికి అందుతుంది.

Image: Eenadu

ఆర్థిక లక్ష్యం


ఇల్లు, కారు, పిల్లల చదువులు ఇలాంటివన్నీ ఆర్థిక లక్ష్యాలే. మీ లక్ష్యాలను సాధించడం కోసం ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి.

Image: Eenadu

ట్రేడింగ్‌ చేస్తున్నారా? ఈ టిప్స్‌ ఫాలోకండి!

ఆర్థిక లక్ష్యం చేరుకోవడం ఎలా?

ఏటీఎం ఛార్జీలు తప్పించుకునే మార్గాలు!

Eenadu.net Home