‘మధ్యతరగతి’కి ఆర్థిక చిట్కాలివిగో..!
మీ జీతం చేతికి రాగానే ముందు మీ అత్యవసరాల కోసం ఖర్చు చేయండి. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి ఆలోచించండి.
Image: Eenadu
నెలవారీ బడ్జెట్‌ను రూపొందించుకోండి. వీలైతే వారం వారీగా ఖర్చుల్ని విభజించుకుంటే ఇంకా మంచిది.
Image: Eenadu
డబ్బు ఆదా చేయాలని చౌకగా లభించే నాసిరకం ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు కొనేయకండి. వీటి వల్ల మరింత ఖర్చు పెరుగుతుంది.
Image:Pixabay
ఎక్కడ, ఎందుకు ఖర్చు చేశారో నెలాఖరున సమీక్షించుకోండి. అనవసరమైన ఖర్చులు ఏం చేస్తున్నారో ట్రాక్ చేయండి.
Image: Pixabay
నాలుగైదు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోండి. మీ ఆరోగ్య/కుటుంబ భద్రత కోసం ఆరోగ్య బీమా/ జీవిత బీమా తీసుకోండి.
Image: Eenadu
పెట్టుబడులు పెట్టే ముందు.. ఆయా రంగాలపై అధ్యయనం చేయండి. పూర్తి అవగాహన వచ్చాకే పెట్టుబడులు ప్రారంభించండి.
Image: Eenadu
ఏ విషయంలోనైనా చిన్న చిన్న రిస్క్‌లు చేయండి. ఇవి మీ విశ్వాసాన్ని పెంచడంతో పాటు మిమ్మల్ని బలోపేతం చేస్తాయి.
Image: Eenadu
ఈఎంఐ, లోన్, క్రెడిట్ కార్డు/ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతుల్లో ఎలాంటి వస్తువుల్నీ కొనుగోలు చేయకండి. మీ వద్ద డబ్బు ఉంటేనే కొనండి.
Image: Eenadu
షాపింగ్‌కు వెళ్లే ముందు మీకు అవసరమైన వస్తువులేంటో జాబితా సిద్ధం చేసుకోండి. వాటిని మాత్రమే కొనుగోలు చేయండి.
Image: Pixabay
చివరగా.. మీ సంపాదనకు మించి ఖర్చు చేయకండి.. ఆదా చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టండి. ఓపికతో ఉండండి!
Image: Eenadu