క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించండిలా!

క్యాన్సర్‌ మాట వినగానే ఒక విధమైన భయం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చే ముందు కొన్ని అనుమానిత లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి.

image:RKC

రొమ్ముక్యాన్సర్‌ అయితే చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతాయి. వాటిని తాకితే విపరీతంగా నొప్పి ఉంటుంది. మామోగ్రఫీ పరీక్షతో నిర్థారించవచ్చు.

image:RKC

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తే నెలసరి అస్తవ్యస్తంగా ఉంటుంది. తరచుగా అధిక రక్తస్రావం అవుతుంది. నెలసరిలో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు పరీక్షలు చేయించాలి. 

image:RKC

వృషణాల్లో క్యాన్సర్‌ వస్తే నొప్పితో పాటు మూత్రంలో రక్తం పడుతుంది. నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది.

image:RKC

గొంతులో గడ్డలుంటే నీళ్లు, ఆహారం మింగలేకపోతారు.

తలనొప్పి, తరచుగా వాంతులు అవుతాయి.

image:RKC

దగ్గు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించాలి. కొన్నిసార్లు దగ్గినపుడు రక్తం కూడా పడుతుంది. బరువు తగ్గిపోతారు.

image:RKC

అండాశయ క్యాన్సర్‌ వచ్చినపుడు నొప్పి అధికంగా ఉంటుంది. భార్యభర్తల కలయిక సందర్భంలో రక్తస్రావం అయ్యే వీలుంది. ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే ప్రమాదం ఉంది.

image:RKC

చర్మ క్యాన్సర్‌ వచ్చినపుడు ఏ చిన్న గాయమయినా రక్తం ఎక్కువగా పోతుంది. నియంత్రణ సాధ్యం కాదు. ఎక్కువగా చిన్నతనంలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

image:RKC

మెదడులో కణితులు ఏర్పడినపుడు మూర్ఛవస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. ఏదీ గుర్తుకు రాదు. తూలిపడిపోతుంటారు.

image:RKC

క్యాన్సర్‌ కావొచ్చనే అనుమానం వచ్చినపుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. స్క్రీనింగ్‌ చేయించడానికి సిద్ధం కావాలి. అవసరమైతే సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ చేయించాలి.

image:RKC

తొలి దశలోనే గుర్తించినట్లయితే నివారణ సులువవుతుంది. క్యాన్సర్‌పై విజయం సాధించగలరు.

image:RKC

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home