హ్యాపీ బర్త్‌డే శ్రీలీల
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పుట్టిన రోజు (జూన్ 14) సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీలీల నటిస్తోన్న చిత్రాల నుంచి తన ఫస్ట్‌లుక్స్ విడుదలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దామా...
Image:Instagram
@ ఆదికేశవ
మెగా హీరో వైష్ణవ్ తేజ్ 4వ చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Image: Twitter
@ నితిన్ 32
పేరు ఖరారు చేయని నితిన్ కొత్త సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది.
Image: Twitter
@ భగవంత్ కేసరి
బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.
Image: Twitter
@ #BOYAPATIRAPO
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ శ్రీలీలే.
Image: Twitter
@ గుంటూరు కారం
మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో ‘గుంటూరు కారం’ రాబోతోంది. ఇందులో హీరోయిన్ పూజాహెగ్డేతోపాటు శ్రీలీల కూడా తెరను పంచుకుంటోంది.
Image: Twitter
@ ఆహా
ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఓ సినిమాను నిర్మిస్తోంది. దీంట్లో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. కాగా.. అల్లు అర్జున్‌తో కలిసి ఈమె ఓ పాటలో స్టెప్పులేయనున్నట్లు ఆహా బృందం ట్వీట్ చేసింది.
Image: Twitter
@ ఉస్తాద్ భగత్ సింగ్
‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో ‘గబ్బర్‌సింగ్’కాంబో రిపీట్ అవుతోంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల నటిస్తోంది.
Image: Twitter
వీటితోపాటు విజయ్ దేవరకొండ ‘వీడీ 12’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, కిరీటీ రెడ్డి ‘జూనియర్’లోనూ ఈ బ్యూటీ నటిస్తోన్న విషయం తెలిసిందే.
Image:Instagram