అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

అల్లు అర్జున్‌ ఫిట్‌గా, అందంగా ఎలా ఉంటారు అని యువత గూగుల్‌లో తెగ వెతికేస్తుంటుంది. ఆయన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఇవే!

బన్ని తన రోజును జాగింగ్‌తో మొదలుపెడతారు. దాదాపు 45 నిమిషాలు జాగింగ్‌ చేస్తారు. 

అల్లు అర్జున్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. కాళ్లు, మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరాన్ని షేప్‌లోకి తీసుకురావడానికి సైక్లింగ్‌ ఉపయోగపడుతుందంటారు. 

జిమ్‌లో పుష్‌అప్స్‌, పుల్‌ అప్స్‌, స్క్వాట్స్‌, డిప్స్‌, క్రంచెస్... ఇలా రెండు గంటల పాటు శరీరం చెమటలు కక్కేలా శ్రమిస్తారు.

 బ్రేక్‌ ఫాస్ట్‌ విషయంలో పూర్తిగా హెల్తీ ఉండేలా చూసుకుంటారు. డ్రైఫ్రూట్స్‌, గింజలు, కొబ్బరి నీళ్ల వంటివి తీసుకుంటారు.

లంచ్‌లో బ్రౌన్‌ రైస్, పప్పు, సలాడ్స్‌ ఉండాల్సిందే. ప్రొటీన్‌ లేదా ఫ్రూట్‌ షేక్‌ కూడా తప్పనిసరి.

రాత్రికి తేలికగా జీర్ణం అయ్యే బ్రౌన్‌ రైస్, సలాడ్‌, బీన్స్‌తో పాటు ఉడికించిన కూరగాయలు తీసుకుంటారు. 

ఆహారం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.. జిమ్‌లో అంత కష్టపడతారు. అందుకే అల్లు అర్జున్‌ ఫిట్‌గా ఉంటున్నారు మరి.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home