ఆసుస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌.. జెన్‌ఫోన్‌ 9

ఈ మొబైల్‌లో 5.9 అంగుళాల ఓఎల్‌ఈడీ శాంసంగ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌.

Image: Asus

ఆసుస్‌ సంస్థ తాజాగా 9 సిరీస్‌లో సరికొత్త 5జీ మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Asus

స్నాప్‌డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు.

Image: Asus

వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 766 సెన్సర్‌.. 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Asus

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో నడిచే ఈ మొబైల్‌లో రెండు స్పీకర్లున్నాయి. పైభాగంలో 7 మ్యాగ్నెట్‌ స్పీకర్‌, కింది భాగంలో 3 మ్యాగ్నెట్‌ స్పీకర్‌ అమర్చారు.

Image: Asus

4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యమున్న ఈ మొబైల్‌.. 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Image: Asus

గేమ్స్‌ ఆడుతున్నప్పుడు మొబైల్‌ వేడెక్కకుండా ఇందులో వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను అమర్చారు.

Image: Asus

జెన్‌ఫోన్‌ 9లో రెండు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు ఆసుస్‌ వెల్లడించింది.

Image: Asus

8 జీబీ / 128 జీబీ, 16 జీబీ /256 జీబీ వేరియంట్లలో.. నాలుగు రంగుల్లో ఈ ఫోన్‌ లభించనుంది.

Image: Asus

మొదట యూరప్‌లో.. ఆ తర్వాత మిగతా దేశాల్లో ఈ మొబైల్‌ అందుబాటులోకి రానుంది. ధర రూ. 65వేల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

Image: Asus 

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home