చిన్న చిన్న వ్యాయామాలు.. ఖర్చు చేయండి కెలోరీలు!

షాపింగ్‌ మాల్స్‌, మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్‌కి బదులు మెట్లు ఎక్కండి. దీని వల్ల శరీరంలో కెలోరీలు కరిగి బరువు తగ్గుతారు.

Image: RKC

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఒక్క చోట కూర్చోకుండా.. అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి.

Image: RKC

టీవీ చూస్తున్నప్పుడు రిమోట్‌ను దూరంగా పెట్టండి. ఛానల్‌ మార్చాలనుకున్నప్పుడు వెళ్లి రిమోట్‌ తెచ్చుకోండి.. తిరిగి అక్కడే పెట్టండి.

Image: RKC

షవర్‌ స్నానం కాకుండా బకెట్‌లోని నీటిని మగ్‌తో తీసుకొని లేచి స్నానం చేయండి.

Image: RKC

స్నానం చేసేటప్పుడు పాటలు పాడినా కెలోరీలు తగ్గి సన్నబడే అవకాశముంది.

Image: RKC

హాస్య సన్నివేశాలు చూసినప్పుడు, స్నేహితులు.. కుటుంబసభ్యులు జోకులు చెబితే బిగ్గరగా నవ్వండి.

Image: RKC

మీ ఇల్లు.. ఆఫీసు ఒకట్రెండు అంతస్తులో ఉంటే లిఫ్ట్‌కి బదులు మెట్ల మార్గాన్నే ఎంచుకోండి.

Image: RKC

కూర్చొని కంప్యూటర్‌ ముందు పనిచేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి నడవాలి.. చేతులు అటు ఇటు ఆడించాలి.

Image: RKC

ఉదయం పళ్లు తోముకునేటప్పుడు ఒంటి కాలిపై నిలబడండి.

Image: RKC

సరుకులు, కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తే నడుచుకుంటూ లేదా సైకిల్‌పై వెళ్లండి. రోజూ ఇవి పాటిస్తూ ఉంటే కెలోరీలు కరిగిపోయి నాజుగ్గా తయారవుతారు. 

Image: RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home