కంటి ఆరోగ్యానికి మేలైన ఆహారం!
ప్రపంచాన్ని మనకు చూపించేది మన కళ్లే. మరి అలాంటి కళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా..! అందుకే, కంటి ఆరోగ్యానికి ఈ ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
Image: Unsplash
క్యారెట్
కంటి చూపును మెరుగుపర్చడంలో కీలక పాత్ర వహించే విటమిన్ ఎ (బీటా కెరోటిన్) క్యారెట్, బీట్‌రూట్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇవి కార్నియాను కాపాడి.. కంటిని సంరక్షిస్తాయి.
Image: Unsplash
ఆకుకూరలు
వీటిలో విటమిన్ ఎ తోపాటు విటమిన్ కె, బీ.. మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపర్చుతాయి.
Image: Unsplash
నిమ్మజాతి పండ్లు
బత్తాయి, ఉసిరి వంటి నిమ్మజాతి పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటిలోని రెటీనాలో ఉండే సున్నితమైన రక్తనాళాలను, కార్నియాలోని కొల్లాజెన్‌ను కాపాడుతుంది.
Image: Unsplash
చిక్కుళ్లు
చిక్కుళ్లు, బీన్స్ వంటి ఆహార పదర్థాల్లో ఉండే బయో ఫ్లేవనాయిడ్స్, జింక్ కంటి రెటీనాను కాపాడుతూ.. కంటి శుక్లం అభివృద్ధి చెందకుండా చూస్తాయి. కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి.
Image: Unsplash
చేపలు
ముఖ్యంగా సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి వెనుక భాగం, రెటీనా ఆరోగ్యంగా ఉంటాయి. కళ్లు పొడిబారవు.
Image: Unsplash
బ్లూబెర్రీస్
వీటిలో ఉండే యాంథోసైనిన్స్, విటమిన్ సి కంటిచూపును మెరుగుపరుస్తాయి. కళ్ల అలసటను పోగొట్టి ఉపశమనం కల్పిస్తాయి.
Image: Unsplash
గుడ్డు
గుడ్డులో విటమిన్ ఎ, జియాక్సంతిన్, ల్యూటిన్, జింక్ పోషకాలున్నాయి. విటమిన్ ఎ కార్నియాను రక్షిస్తుంది. ల్యూటిన్, జియాంక్సంతిన్ కంటిశుక్లాలు, వయసు సంబంధిత కంటి సమస్యలను తగ్గిస్తాయి. జింక్ రెటీనాను కాపాడుతుంది.
Image: Unsplash
బాదం
ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్లు కళ్లపై ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోజూ నానబెట్టిన బాదం పప్పును తినాలి.
Image: Unsplash