అర్ధరాత్రి ఆకలేస్తోందా? అయితే ఇవి తినండి!
పాప్‌కార్న్
అర్ధరాత్రి ఆకలేసినప్పుడు ఇంట్లో తయారు చేసిన పాప్‌కార్న్ తినొచ్చు. వీటి ద్వారా శరీరంలోకి చేరే కెలోరీలు, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ.
Source: Pixabay
ఫూల్ మకాన్(తామర గింజలు)
ఫూల్ మకాన్ తక్కువ కెలోరీలు ఉన్న స్నాక్ ఐటమ్. ఇందులో కొవ్వు ఉండదు. కెలోరీలు కూడా తక్కువగా ఉంటాయి.
Source: Pixabay
ఓట్స్
ఓట్స్‌లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని అర్ధరాత్రి వేళ తీసుకోవచ్చు. ఓట్స్‌లో పాలు, అరటిపండు కలిపి తినొచ్చు.
Source: Pixabay
మరమరాల మిక్సర్
బియ్యంతో చేసే మరమరాల్లో తక్కువ కెలోరీలతో పాటు కొవ్వులు ఉండవు. మరమరాలలో ఉల్లిగడ్డలు, పల్లీలు, పుట్నాలు మిక్స్ చేసి తినొచ్చు.
Source: Pixabay
వేయించిన పల్లీలు
వేయించిన పల్లీలు కూడా ఆకలిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే మంచి కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Source: Pixabay
చాక్లెట్ మిల్క్
చాక్లెట్ కలిపిన పాలు తీసుకోవచ్చు. ఇంట్లో చేసిన చాక్లెట్‌ను వాడటం వల్ల కెలోరీలు తగ్గించుకోవచ్చు.
Source: Pixabay
రోటీ/పీనట్ బటర్
జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలతో పీనట్ బటర్ రాసి తీసుకోవచ్చు.
Source: Pixabay
పెరుగు
పెరుగులో మీకు నచ్చిన పండ్లు వేసుకొని తినేయండి. పెరుగులో ఉండే ప్రొటీన్, క్యాల్షియం వల్ల తొందరగా కడుపు నిండుతుంది.
Source: Pixabay