ఇవి క్యాన్సర్‌ ముప్పుని తగ్గిస్తాయి!

గ్రీన్ టీ

ఇది యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. అన్నవాహిక, ఊపిరితిత్తులు, నోటి, పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది.

Image:Pixabay

నారింజ

నారింజలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. చెడు కొలెస్ట్రాల్, బరువును తగ్గిస్తాయి. నారింజ చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.

Image:Pixabay

బ్రకోలీ

ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ప్రొస్టేట్, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో ఇది సాయపడుతుంది. ఇందులో ఉండే సల్ఫోరాఫాన్ శరీరంలోని రక్షణాత్మక ఎంజైమ్‌లను ప్రేరేపించి విషతుల్య మలినాలను తొలగిస్తుంది.


Image:Pixabay

వెల్లుల్లి

ఇందులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తుంది. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.

Image:Pixabay

పసుపు

క్యాన్సర్‌ను ఇది సమర్థంగా నిరోధిస్తుంది. రొమ్ము, పేగు, చర్మ సంబంధిత క్యాన్సర్ కణాలను పసుపు నిర్వీర్యం చేస్తుంది.

Image:Pixabay

యాపిల్

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని అంటుంటారు. క్యాన్సర్ విషయంలో కూడా ఇది నిజమే. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

Image:Pixabay

దానిమ్మ

ఇది రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పాలీఫినాల్‌ను కలిగి ఉంటుంది. ఈ పాలీఫినాల్ క్యాన్సర్ పెరగకుండా చూస్తుంది.

Image:Pixabay

అల్లం

ఇది క్యాన్సర్ కణాలను తమంత తాముగా నశించేటట్లు చేస్తుంది. అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేగాక ఈ కణాలు విస్తరించే శక్తిని కూడా అడ్డుకుంటుంది.

Image:Pixabay

ద్రాక్ష

ఇందులోని ఎలాజిక్ యాసిడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. పర్యావరణంలోని విష పదార్థాలు శ్వాస వ్యవస్థకు హాని చేయకుండా ఎలాజిక్ యాసిడ్ చూస్తుంది.

Image:Pixabay

క్యారెట్

క్యారెట్‌లో క్యాన్సర్‌ను నిరోధించే బయోఫ్లేవనాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్‌లు ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఇవి తగ్గిస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించడానికి క్యారెట్‌లు ఎంతగానో తోడ్పడతాయి.

Image:Pixabay

సాల్మన్ చేపలు  

సాల్మన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం ఈ చేపల్లో లభ్యమవుతాయి. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయి.

Image:Pixabay

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home