వీటితో చెడు కొలెస్ట్రాల్‌కి చెక్‌ పెట్టొచ్చు!

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే..!

Image: RKC

బార్లీ ముడిధాన్యం లాగా కనిపిస్తుంది. ఇందులోని ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ను వేగంగా తగ్గిస్తుంది.

Image: RKC

వంకాయను చూస్తే చాలా మంది ఒంటికి పడదని దూరం పెడుతారు. కానీ తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image: RKC

యాపిల్‌ తింటే కూడా చాలా మంచిది. విటమిన్‌ సి, ఏక్టిన్‌ అనే పదార్థం ఉండటంతో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది.

Image: RKC

బాదం, వాల్‌నట్స్‌లోని ఫ్యాటీ యాసిడ్స్‌ రక్తంలోని చెడు కొవ్వును తొలగిస్తాయి. వీటిలోని ఓమేగా-3 కొవ్వు కూడా మంచి ఫలితాన్నిస్తుంది.

Image: RKC

టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తాయి. బ్లాక్‌ టీ శరీరంలో అక్కరకు రాని కొవ్వును తగ్గిస్తుంది.

Image: RKC

ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ధమనుల్లోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image: RKC

ఓట్స్‌ రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. రోజూ 43 మి.గ్రాల ఓట్స్‌ ఆహారంగా తీసుకోవడంతో రెండు నెలల్లో 14 శాతం చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది.

Image: RKC

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home