బాడీ షేమింగ్ టు.. ‘బాగీ 4’
2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న హర్నాజ్ సంధు ‘బాగీ 4’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.
పంజాబీలో ‘యారా దియాన్ పూన్ బరన్’(2021), ‘బాయ్ జీ కుట్టన్ గే’(2022)లో నటించింది.
హర్నాజ్ 2000లో పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో పుట్టింది. తర్వాత చండీగఢ్‌కు షిఫ్టు అయ్యింది.
చండీగఢ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
టీనేజ్ నుంచే మోడలింగ్ చేయడం ప్రారంభించింది. బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొంది.
2017లో మిస్ చండీగఢ్ టైటిల్‌ను గెలుచుకుంది. దాంతో పాటు మిస్ చండీగఢ్ ఫ్రెష్ ఫేస్‌గానూ నిలిచింది.
మొదటి కాంటెస్ట్‌లో గెలిచేంత వరకూ తండ్రి దగ్గర ఈ విషయం దాచిపెట్టింది. విజయం అందుకున్నాకే తన ఇష్టం నాన్నకు చెప్పింది.
కెరీర్ ప్రారంభంలో హర్నాజ్ బాడీ షేమింగ్‌కు గురైంది. ఆ అవమానాల గురించి గతంలో చెప్పింది.
ఆ ఒడుదొడుకులు ఎదుర్కొన్న తర్వాతే 2021లో మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.
షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రాకు వీరాభిమాని. మక్కి రోటితో పాటు తోటకూర పప్పు అంటే ఇష్టం. ‘గుడ్ ఫుడ్ గుడ్ మూడ్’ అంటోంది హర్నాజ్.
ఖాళీ సమయం దొరికితే గుర్రపు స్వారీ చేస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తుంది.
పియానో వాయించడం ఈమె హాబీ.. దీని వల్ల కొత్త ఉల్లాసం కలుగుతుంది అని చెప్పింది.