తొక్కలతో లాభాలెన్నో!

సింక్‌, కుళాయిలపై తరచూ మరకలు అవడం మనం గమనిస్తూనే ఉంటాం. నిమ్మ, కమలాఫలం తొక్కలను వాటిపై రుద్దితే మరకలు పోయి మెరుస్తాయి.

Image:pixabay

నిమ్మ, కమలాఫలం తొక్కల్ని కొన్ని నీళ్లలో వేసి మరిగించి చల్లారాక వడకట్టుకొని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సింక్‌, బాత్‌రూమ్‌లో నీళ్లు పోయే చోట తరచూ స్ప్రే చేస్తే అక్కడ బ్యాక్టీరియా, క్రిములు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

Image:pixabay

కీరా తొక్కలు, దోస పొట్టు ఇంట్లో చీమల బెడదను తగ్గిస్తాయి. చీమలు ఉండే చోట వీటిని ఉంచితే సరి.

Image:unsplash

అరటిపండు తొక్కను మాస్క్‌గా వేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది. షూస్‌ మకిలి వదిలించడానికి కూడా అరటిపండు తొక్కలు ఉపయోగపడతాయి.

Image:unsplash

బంగాళాదుంప చెక్కును మెత్తగా నూరి ప్యాక్‌లా వేసి పావుగంట తర్వాత కడిగేస్తే ముఖం తేటగా ఉంటుంది. కళ్లకు అలసట తగ్గుతుంది. మాడిపోయిన గిన్నెలను తోమడానికి కూడా ఆలూచెక్కును వినియోగించవచ్చు.

Image:unsplash

మనం సాధారణంగా మామిడిపండుపై పొట్టు తీసి ముక్కలు కోసుకుని తింటాం. కానీ పొట్టుతో సహా జ్యూస్‌ చేయడం వల్ల మరిన్ని పోషకాలూ, పీచుపదార్థం శరీరానికి అందుతాయట.

Image:pixabay 

రబ్బర్‌ ప్లాంట్‌ వంటి మందపాటి, ప్రకాశవంతమైన ఆకులుండే ఇండోర్‌ మొక్కల్ని అరటి పండు తొక్కలతో మృదువుగా తుడవడం వల్ల వాటిపై ఉండే దుమ్ము తొలగిపోయి.. అవి తిరిగి ప్రకాశవంతంగా మారతాయి.

Image:unsplash

పుచ్చకాయలో ఎర్రటి భాగాన్ని మాత్రమే తిని తక్కిందంతా పడేస్తుంటాం. దానితో రోటి పచ్చడి లేదా జామ్‌, స్మూతీస్‌ చేసుకోవచ్చు.

Image:unsplash

 కూరగాయల చెక్కును కుక్కర్‌లో ఉడికించి సూప్‌ చేసుకోవచ్చు లేదా రుబ్బి బియ్యప్పిండిలో కలిపి వడియాలు పెట్టొచ్చు.

Image:unsplash

పండ్లు, కాయగూరల తొక్కల్ని కాసేపు ఎండలో ఉంచి ఆ తర్వాత మట్టిలో కలిపి కొన్నాళ్ల పాటు అలాగే వదిలేస్తే మనకు కావల్సిన సహజ ఎరువు తయారవుతుంది. దీన్ని ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం వాడుకోవచ్చు.

Image:unsplash

బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

సెక్సువల్‌ అసాల్ట్‌ అవేర్‌నెస్‌ మంత్‌

Eenadu.net Home