#eenadu

నిత్యం సొంత వాహనాల్లో ప్రయాణించే వారు నెలలో ఇంధన కొనుగోళ్లకే ఎక్కువ మొత్తం వెచ్చిస్తుంటారు. అలాంటి వారి కోసమే కొన్ని క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి.

నెల మొత్తానికి ఇంధనం కోసం ఎంత మొత్తం వెచ్చించామో తెలుసుకోవడంతో పాటు రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లూ పొందొచ్చు. ఆ కార్డుల వివరాలు ఇవే..

బీపీసీఎల్‌ ఎస్‌బీఐ కార్డ్‌ ఆక్టేన్‌

బీపీసీఎల్‌ పెట్రోల్‌ పంపుల వద్ద చేసే ఫ్యూయల్ కొనుగోలుపై 25X రివార్డు పాయింట్లు పొందొచ్చు. 6.25 శాతం రివార్డులతో పాటు 1 శాతం సర్‌ఛార్జి మినహాయింపు లభిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఇండియన్‌ ఆయిల్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపుల్లో వినియోగంపై 5 శాతం ఫ్యూయల్ పాయింట్లు పొందొచ్చు. అంతేకాదు సరకులు, బిల్‌ పేమెంట్లపైనా 5 శాతం రివార్డులు లభిస్తాయి.

ఐసీఐసీఐ హెచ్‌పీసీఎల్‌ కోరల్‌ వీసా/మాస్టర్‌

హెచ్‌పీసీఎల్‌కు చెందిన పెట్రోల్ పంపుల్లో ఇంధన కొనుగోలుపై 2.5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 1 శాతం ఇంధన సర్‌ఛార్జి మినహాయింపు లభిస్తుంది. ప్రతి 2000 రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడం ద్వారా రూ.500 విలువైన ఫ్యూయల్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఇండియన్‌ ఆయిల్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంపుల్లో ఫ్యూయల్‌ కొనుగోళ్లపై 4 శాతం (రూ.100కు 20 పాయింట్లు) వాల్యూ బ్యాక్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌పై 1 శాతం (రూ.100కు 5 పాయింట్లు) చొప్పున రివార్డులను బ్యాంక్‌ అందిస్తోంది.

కోటక్‌ ఇండియన్‌ ఆయిల్‌ క్రెడిట్‌ కార్డ్‌

ప్రతి రూ.150 ఇంధన ఖర్చుపై 24 రివార్డు పాయింట్లు వస్తాయి. అంటే 4 శాతం ఆదా అవుతుంది. ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో గరిష్ఠంగా 1200 పాయింట్లు పొందొచ్చు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ పవర్‌ క్రెడిట్ కార్డ్‌

ఇంధన ఖర్చుపై 5 శాతం రాయితీ పొందొచ్చు. హెచ్‌పీ పే యాప్ ద్వారా చేసే చెల్లింపులపై 1.5 శాతం వాల్యూ బ్యాక్‌ లభిస్తుంది.

డబ్బు ఆదా చేసే సూపర్‌-10 టిప్స్‌

ఈ ఏడాది ఐపీఓకు రానున్న 10 స్టార్టప్స్‌ ఇవే!

పండుగ షాపింగ్‌ కోసం ఈ చిట్కాలు చూడండి..

Eenadu.net Home