ఎఫ్‌ అండ్‌ ఓ కొత్త రూల్స్‌ తెలుసా..?

అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O) విభాగంలో ట్రేడింగ్‌ చేసిన వారు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారని తెలిసినా పెట్టుబడులు మాత్రం ఆగడం లేదు.

2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో 91 శాతం మంది నష్టాలు చవిచూసినట్లు ఇటీవల సెబీ నివేదిక తెలిపింది.

దీంతో ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడానికి కఠిన విధానాలను సెబీ తాజాగా ప్రకటించింది. అవేంటంటే?

సూచీల డెరివేటివ్స్‌ కనీస కాంట్రాక్ట్‌ విలువను రూ.5- 15 లక్షల నుంచి రూ.15- 20 లక్షలకు సెబీ పెంచింది.

స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు ఏదో ఒక ప్రామాణిక సూచీకి మాత్రమే వారంలో గడువు తీరే కాంట్రాక్టును అందుబాటులో ఉంచాలని ఎక్స్ఛేంజీలను ఆదేశించింది.

ఇకపై ఎక్స్‌పైరీ రోజున షార్ట్‌ (సెల్లింగ్‌) ఆప్షన్స్‌ కాంట్రాక్టుకు అదనంగా 2% మార్జిన్‌ వసూలు చేయనున్నారు.

ఆప్షన్స్‌ కొనుగోలుదార్లు ముందుగానే పూర్తి స్థాయిలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

రోజువారీగా పొజిషన్ల పరిమితిని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు పరిశీలించాలి. ఉల్లంఘనలను గుర్తించేందుకు కనీసం 4 సార్లు స్నాప్‌షాట్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

కాంట్రాక్టు గడువు ముగింపు రోజున క్యాలెండర్‌ స్ర్పెడ్‌ ప్రయోజనం అందుబాటులో ఉండదు. నవంబర్‌ 20 నుంచి దశలవారీగా వీటిని సెబీ అమలు చేయనుంది.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home