చరణ్‌తో నటించే ఛాన్స్‌ వస్తేనా...

‘టైగర్‌ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నటించి తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది గాయత్రి భరద్వాజ్‌. త్వరలో అల్లు శిరీశ్‌ ‘బడ్డీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా.. ఆమె అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

‘టైగర్‌...’లో మణి పాత్రకి దాదాపు 60 మందిని ఆడిషన్‌ చేసి.. గాయత్రిని ఓకే చేశారు. ‘ఆ పాత్ర నా కోసం రాసి పెట్టి ఉంది. అందుకే నాకు దక్కింది’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది గాయత్రి.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2018లో ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఓ బాలీవుడ్‌ సినిమా, వివిధ వెబ్‌సిరీసుల్లో నటించింది.

ఏడేళ్ల వయసులోనే ర్యాంప్‌ వాక్‌ చేసింది. అప్పటి నుంచే నటనపై ఇష్టం ఏర్పడిందట.

గాయత్రి ఎక్కువగా మాట్లాడదు.. తెలిసిన వాళ్లే అయినా తక్కువగానే మాట కలుపుతుంది.  

మొదటి సినిమా నుంచే తెలుగు నేర్చుకుని మాట్లాడే ప్రయత్నం చేసింది. తెలుగు సినిమా మీద ప్రేమ వల్ల అలా చేశానని చెప్పింది.

‘రామ్‌ చరణ్‌ అంటే ఇష్టం. కలసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

ర్యాంప్‌ వాక్‌లు, ఫ్యాషన్‌ షోల్లో పాల్గొంటుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతూ, వివిధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

సోషల్‌ మీడియాలో గాయత్రి చాలా యాక్టివ్‌. ఆమెకు పదిలక్షల మందికిపైగా ఫాలోవర్లున్నారు.

This browser does not support the video element.

గాయత్రి ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతుంది. ‘నచ్చినవన్నీ తినేస్తుంటాను. మరి ఫిట్‌నెస్‌ని మెయింటెన్‌ చేయాలంటే జిమ్‌లో కష్టపడాల్సిందే..’ అంటోందీ బ్యూటీ.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home