గ్లామర్‌ గర్ల్‌.. గెహనా

ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కిన ‘చోర్‌ బజార్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి.. గెహనా సిప్పీ.

image:Instagram/gehnasippy11

తాజాగా సుడిగాలి సుధీర్‌ నటించిన ‘గాలోడు’లో హీరోయిన్‌గా రెండోసారి తెలుగు తెరపై మెరవనుంది. ఈ చిత్రం నవంబర్‌ 18న విడుదల కానుంది.

image:Instagram/gehnasippy11

ముంబయిలో 2000 అక్టోబర్‌ 11న జన్మించిన గెహనాకి.. చిన్నప్పట్నుంచీ నటన అంటే ఇష్టం.. సినిమాల మీద ఉన్న ఆసక్తితో కాలేజీకి కూడా వెళ్లేది కాదట!

image:Instagram/gehnasippy11

తరచూ ఫొటో షూట్లలో పాల్గొంటూ అవకాశాల కోసం ప్రయత్నించేది. ఈ క్రమంలోనే తనకు తెలుగు సినిమావకాశాలు వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

image:Instagram/gehnasippy11

హీరోయిన్‌ అయ్యాక గ్లామర్‌ డోస్‌ కాస్త పెంచేసింది గెహనా. ఎప్పటికప్పుడు తన హాట్‌ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. image:Instagram/gehnasippy11

దీంతో ఈమెకు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ పెరిగిపోయింది. ఇన్‌స్టాలో ఫాలోవర్లూ పెరుగుతున్నారు. image:Instagram/gehnasippy11

‘గ్లామర్‌గా కనిపించడమే కాదు.. నటిగా మంచి పాత్రలు చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. image:Instagram/gehnasippy11

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. ఆయన తీసిన ‘ఫిదా’, ‘లవ్‌స్టోరీ’ ఈ భామకు ఫేవరెట్‌ సినిమాలట. 

image:Instagram/gehnasippy11

హీరోల్లో ధనుష్‌, నాగ చైతన్య, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది.

image:Instagram/gehnasippy11

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

Eenadu.net Home