హ్యాపీ బర్త్‌డే.. హాసిని..

అమితాబ్‌బచ్చన్‌తో పాటు పార్కర్‌ పెన్ యాడ్‌లో నటించిన భామే ఈ జెనీలియా డిసౌజా. 2003లో ‘తుజ్‌హే మేరి కసమ్‌’తో సినిమా జీవితం ఆరంభించింది. ప్రస్తుతం కన్నడలో రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న ‘జూనియర్‌’లో నటిస్తోంది.

(photos:instagram/geneliad)

ఇటీవల జెనీలియా నటించిన కుటుంబ కథా చిత్రం 

‘ట్రైల్‌ పీరియడ్‌’ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి ఆలేయసేన్‌ దర్శకత్వం వహించారు. 

ఈ సుందరి 2003లో మొదటిగా ‘బాయ్స్‌’ తెలుగు, తమిళ్‌ ద్వి భాషా చిత్రంతో అరంగేట్రం చేసింది. దాంట్లో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాగా పాపులరైంది. 

హీరో సిద్ధార్థ్‌ జెనీలియా కలిసి నటించిన ‘బొమ్మరిల్లు’ 2006లో విడుదలైంది. ఈ చిత్రంలో హాసిని క్యారెక్టర్‌తో అభిమానుల్ని కట్టిపడేసింది. తన నటన కారణంగానే ఆ చిత్రం ఎవర్‌గ్రీన్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో జెనీలియా మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డునూ అందుకుంది.

ఈ బీటౌన్‌ బ్యూటీ 2003 నుంచి 2012 వరకూ వరస అవకాశాలతో తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది. సినిమాల్లో అల్లరి తెలుగమ్మాయి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయేది. 

ఈ భామ 1987లో ఆగస్టు 5న ముంబయిలో పుట్టింది. చదువంతా ముంబయిలోనే సాగింది. ‘తుజ్‌హే మేరి కసమ్‌’తో 16 ఏళ్లప్పుడే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అదే సమయంలో వరసగా పలు ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఈమె ఓ దశాబ్దం పాటు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా నిలిచింది. 

‘సత్యం’, ‘సాంబ’, ‘సై’, ‘నా అల్లుడు’, ‘హ్యాపీ’, ‘ఢీ’,‘రెడీ’, ‘శశిరేఖా పరిణయం’, ‘ఆరెంజ్‌’, ‘కథ’ వంటి పలు చిత్రాలతో తన సహజ నటనతో ఆకట్టుకుంది. ‘బొమ్మరిల్లు’ తర్వాత తెలుగు అభిమానులు తనని హాసినిగానే గుర్తుపెట్టుకున్నారు. 

మొదటి చిత్రం షూటింగ్‌ నుంచే తోటి నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా మధ్య ప్రేమ చిగురించింది. దాని తర్వాత వరసగా వీరిద్దరి గురించి రూమర్లు వచ్చాయి. మొత్తం మీద 2012లో వీరిద్దరూ వివాహం చేసుకొని వాటన్నింటికీ చెక్‌పెట్టారు.

ప్రస్తుతం జెనీలియాకి రియాన్‌, రహైల్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. పెళ్లి తర్వాత పిల్లలు.. కెరియర్‌కి కొంత కాలం గ్యాప్‌ ఇచ్చిన బీటౌన్‌ బ్యూటీ మళ్లీ రంగంలోకి దిగింది. 

కుటుంబం, షూటింగ్‌లలో బిజీగా ఉన్నా ఇన్‌స్టాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు రీల్స్‌ చేస్తూ, వాటిని పోస్టు చేస్తుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home