రాఖీ కట్టే సోదరికి ఈ గిఫ్ట్స్‌ ఇచ్చి చూడండి!

గ్యాడ్జెట్స్‌


మొబైల్‌, మొబైల్‌ యాక్సెసెరీస్‌ మంచి ఎంపిక. మీ బడ్జెట్‌ను బట్టి మొబైల్‌ లేదా హెడ్‌ఫోన్స్‌, పవర్‌ బ్యాంక్స్‌, స్మార్ట్‌వాచ్‌, కస్టమైజ్డ్‌ మొబైల్‌ కేస్‌, హార్డ్‌ డిస్క్‌, ఏఐ స్పీకర్స్‌ తదితర గ్యాడ్జెట్స్‌ను సోదరికి బహుమతిగా ఇవ్వొచ్చు.

Image: Unsplash

గిఫ్ట్‌ వోచర్స్‌


రాఖీ కట్టగానే జేబులో నగదు తీసి ఇవ్వడం సాధారణమే. కానీ, డబ్బును డిజిటల్‌ గిఫ్ట్‌ వోచర్స్‌గా ఇచ్చి చూడండి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తదితర ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌ వోచర్స్‌ను రిడీమ్‌ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి.

Image: Unsplash

బ్యూటీ ప్రొడక్ట్స్‌


ఖరీదైన పర్‌ఫ్యూమ్‌, ఇతర సౌందర్య సాధనాలను బహుమతిగా ఇచ్చి సోదరిని సర్‌ప్రైజ్‌ చేయొచ్చు. కస్టమైజ్డ్‌ దిండ్లు, టీ కప్పులు వంటివి కూడా ఇవ్వొచ్చు.

Image: Unsplash

చాక్లెట్స్‌/స్వీట్స్‌


రెగ్యులర్‌గా దుకాణాల్లో లభించేవి కాకుండా.. మీ సోదరికి నచ్చే చాక్లెట్స్‌/స్వీట్స్‌ ఒక్కచోట చేర్చి తయారు చేసే కస్టమైజ్డ్‌ గిఫ్ట్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. వాటిని ట్రై చేయొచ్చు.

Image: Unsplash

జిమ్‌ మెంబర్‌షిప్‌


ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం. కాబట్టి జిమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకొని సోదరికి గిఫ్ట్‌గా ఇవ్వండి. దీంతో వారికి వ్యాయామం అలవాటై.. ఆరోగ్యంగా ఉంటారు.

Image: Unsplash

మొక్కలు


పర్యావరణానికి మేలు చూసే మొక్కలనూ బహుమతులుగా ఇవ్వొచ్చు. అందమైన/అరుదైన మొక్కలను గిప్ట్‌గా ఇవ్వండి.

Image: Unsplash

టూర్‌ ప్యాకేజీ


మీ సోదరికి నచ్చే పర్యాటక ప్రాంతానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి. ఇందుకోసం టూర్‌ ప్యాకేజీని తీసుకొని దాన్ని గిఫ్ట్‌గా ఇవ్వండి.

Image: Unsplash

అది కుదరకపోతే.. మీరే సరదాగా సోదరిని బయటకు తీసుకెళ్లి.. రెస్టారెంట్‌లో తనకు నచ్చిన ఆహారం తినిపించండి. చాలా ఆనందపడతారు.

Image: Unsplash

ఫ్యాషన్‌.. ఫుడ్‌.. టూరిజం.. కేరాఫ్‌ అడ్రస్‌ ఇటలీ!

అయితే ఈ చట్టాలు మీకోసమే...

ఈ లక్షణాలు ఉండాల్సిందే..

Eenadu.net Home