సోషల్‌ మీడియాకి విరామం ఇవ్వండి.. ఎంత లాభామో!

ఇప్పటి యువతకు సోషల్‌మీడియా ఒక వ్యసనంగా మారిపోయింది. లైకులు, కామెంట్లు, ఫాలోవర్స్‌ కోసం వెంపర్లాడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మానసిక సమస్యలు తలెత్తుతాయట. అందుకే.. అప్పుడప్పుడు వీటన్నింటికీ విరామం ఇవ్వడం మంచిదంటున్నారు నిపుణులు.

Image: RKC

చాలా మంది సోషల్‌మీడియాలో ఇతరులతో పోల్చుకొని తాము అలా లేమని బాధపడుతుంటారు. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదముంది.

Image: RKC

నిజానికి సోషల్‌మీడియాలో కనిపించినవన్నీ నిజమని నమ్మలేం. కొంత మంది కేవలం ఇతరులకు సంతోషంగా ఉన్నామని చూపించుకొనేందుకే పోస్టులు పెట్టొచ్చు. నిజ జీవితంలో సంతోషంగా ఉండకపోవచ్చు. వాటిని చూసి అనవసరంగా ఒత్తిడికి గురై.. కుంగిపోవొద్దు.

Image: RKC

సోషల్‌మీడియాకు కొంతకాలం దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

Image: RKC

సోషల్‌మీడియాకి దూరంగా ఉంటే.. నెటిజన్ల లైకులు, కామెంట్లే కాదు. వాటి కన్నా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయని తెలుస్తుంది.

Image: RKC

సోషల్ మీడియాలో మునిగిపోయి గంటల తరబడి స్క్రోల్‌ చేస్తూ కూర్చునే బదులు.. ఒంటరిగా కొత్త ప్రదేశాలను సందర్శించొచ్చు. దీని వల్ల ప్రత్యక్షంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త అనుభూతులు పొందుతారు. 

Image: RKC

కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకోండి. ఇంట్లో పరిస్థితులపై ఆరా తీయండి. మంచి భవిష్యత్తు కోసం మీరు ఇంకా ఎంత కష్టపడాలో తెలుసుకోవచ్చు. 

Image: RKC

ఆన్‌లైన్‌ స్నేహితుల్ని పక్కన పెట్టి.. మీ నిజజీవితంలో ఉన్న స్నేహితులతో కొంత సమయం గడపండి. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోండి. దీంతో మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. 

Image: RKC

రోజూ సోషల్‌మీడియాకు కేటాయించే సమయాన్ని మీ ఎదుగుదలకు మళ్లించండి. మీ కెరీర్‌కు ఉపయోగపడే కోర్సులు చేయండి. మంచి పుస్తకాలు చదవండి. 

Image: RKC

ఏదైనా క్రీడను హాబీగా మార్చుకోండి. రోజూ ఆడుతూ ఉంటే.. శారీరకంగా దృఢంగా మారడమే కాదు.. క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతాయి. 

Image: RKC

వైద్యరంగంలో స్థిరపడాలంటే డాక్టరే అవ్వాలా?

విదేశాల్లో చదవాలంటే.. ఈ పరీక్షలు రాయాల్సిందే!

పర్యావరణ హితం రంగుల హోలీ!

Eenadu.net Home