సల్మాన్ సినిమాలో.. సొగసుల తారలు!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ వెంకటేశ్ కలిసి నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’. తాజాగా విడుదలైన ఈ సినిమాలో స్టార్ హీరోలతోపాటు అందమైన తారలు తెరపై కనిపించి కనువిందు చేశారు. వారెవరంటే..
Image: Twitter
పూజా హెగ్డే
టాలీవుడ్‌లో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’లో సల్మాన్‌కు జోడీగా నటించింది.
Image: Instagram
భూమిక చావ్లా
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక కూడా ఇందులో నటించింది. పూజా హెగ్డేకి సోదరుడిగా నటించిన వెంకటేశ్‌కు భార్యగా కనిపించింది. గతంలో ఈమె వెంకీతో కలిసి ‘వాసు(2002)’లో నటించింది.
Image: Instagram
షెహనాజ్ గిల్
హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులరైన షెహనాజ్.. పంజాబీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ తెరపై ఎంట్రీ ఇచ్చింది.
Image: Instagram
పలక్ తివారీ
‘బిజిలీ’, ‘మాంగ్తా హై క్యా’ మ్యూజిక్ వీడియోల్లో మెరిసిన పలక్.. ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’లో నటిస్తోంది.
Image: Instagram
వినాలీ భట్నాగర్
ఫ్యాషన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోడల్ వినాలీ. గతంలో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించిన ఈ భామ.. సల్మాన్ చిత్రంతోనే తెరంగేట్రం చేసింది.
Image: Instagram
అమృత పూరి
ఈ బాలీవుడ్ భామ.. 2010లో ‘అయిషా’తో తెరంగేట్రం చేసింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలతో బిజీగా ఉంది. అమృత కూడా ఈ సినిమాలో నటించింది.
Image: Instagram
హిమాన్షి ఖురానా
బీటౌన్ బ్యూటీ హిమాన్షి మ్యూజిక్ వీడియోస్‌తోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హిందీ ‘బిగ్‌బాస్ 13’లో పాల్గొనడంతో ఫేమసైంది. ఈ నేపథ్యంతో సల్మాన్ చిత్రంలో అవకాశం దక్కింది.
Image: Instagram
భాగ్యశ్రీ
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా సల్మాన్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఇటీవల ‘రాధేశ్యామ్’లో ప్రభాస్‌కు తల్లిగా నటించింది.
Image: Instagram