బంగారం... భలేగుంది వయ్యారం!
జీవిత రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక తల్లిదండ్రుల దారిలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
Image: Instagram/Shivathmika Rajashekar
‘దొరసాని’తో హీరోయిన్‌గా మారిన ఈ భామ.. ఇటీవల ‘రంగమార్తాండ’లో ‘బంగారం’లా కనిపించి ఆకట్టుకుంది.
Image: Instagram/Shivathmika Rajashekar
తాజాగా ఈ తెలుగందం.. 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే నీలిరంగు చీరలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి.
Image: Instagram/Shivathmika Rajashekar
శివాత్మిక సోదరి శివానీ కూడా ఆ ఫొటోలపై స్పందిస్తూ ‘రాష్ట్రాలు తగలబడిపోతే ఎవరిది బాధ్యత?’ అంటూ కామెంట్ చేసింది.
Image: Instagram/Shivathmika Rajashekar
యంగ్ హీరోయిన్లు సిమ్రన్ చౌదరి, కాశ్మీరా పరదేశీ, డింపుల్ హయతి, ఇషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా కూడా అదిరిపోయావంటూ కామెంట్స్ చేశారు.
Image: Instagram/Shivathmika Rajashekar
ఎక్కువగా సంప్రదాయబద్ధంగా, హద్దులు దాటని అందాలతో ఆకట్టుకునే శివాత్మిక.. ఈ మధ్య గ్లామర్‌డోస్ పెంచేసింది.
Image: Instagram/Shivathmika Rajashekar
చీరకట్టు అయినా.. మోడ్రన్ దుస్తులైనా తన గ్లామర్‌తో కుర్రకారును ఆకర్షిస్తోంది.
Image: Instagram/Shivathmika Rajashekar
తొలి చిత్రం ‘దొరసాని’ విడుదలైన మూడేళ్ల తర్వాత ‘పంచతంత్రం’తో తెలుగు ప్రేక్షకుల్ని మళ్లీ పలకరించింది శివాత్మిక.
Image: Instagram/Shivathmika Rajashekar
తమిళ్‌లోనూ ‘నీతమ్ ఒరు వానమ్’లో నటించింది. ఆ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం’ పేరుతో విడుదల చేశారు.
Image: Instagram/Shivathmika Rajashekar
వరసపెట్టి సినిమాలు చేస్తున్నా.. శివాత్మికకు సరైన గుర్తింపు రావట్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.
Image: Instagram/Shivathmika Rajashekar