పిక్సెల్‌ 9 సిరీస్‌.. విశేషాలివీ

గూగుల్‌ ఆగస్టు 13న ఏర్పాటు చేసిన ‘మేడ్‌ బై గూగుల్‌’ ఈవెంట్‌లో పిక్సెల్‌ 9 సిరీస్‌లో కొత్త మోడళ్లను లాంచ్‌ చేసింది. ఇందులో పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో, పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌.. పేరిట మూడు ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లతో పాటు ఓ ఫోల్డబుల్‌ ఫోన్‌నూ తీసుకొచ్చింది.

పిక్సెల్‌ ఫోన్లకు ఏడేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్లను గూగుల్‌ ఇవ్వనుంది. టెన్సార్‌ జీ4 ప్రాసెసర్‌తో పాటు టైటాన్‌ ఎం2 సెక్యూరిటీ చిప్‌ను ఈ ఫోన్లలో అమర్చారు.

పిక్సెల్‌ 9

ఆండ్రాయిడ్‌ 14తో పనిచేసే ఈ ఫోన్‌ 6.3 అంగుళాల ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే వస్తోంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.79,999.

50 ఎంపీ + 48 ఎంపీ కెమెరాతో పాటు ముందు వైపు ఆటోఫోకస్‌తో 10.5 ఎంపీ డ్యూయల్‌ పీడీ సెల్ఫీ షూటర్‌ అమర్చారు. 4,700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

పిక్సెల్‌ 9 ప్రో

16జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.1,09,999. ఈ ఫోన్‌ 6.3 అంగుళాల సూపర్‌ ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. 4,700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

50 ఎంపీ+ 48 ఎంపీ + 48 ఎంపీ కెమెరాలతో పాటు ముందు వైపు 42 ఎంపీ డ్యుయల్‌ సెల్ఫీ కెమెరా అమర్చారు.

పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌

6.8 అంగుళాల సూపర్‌ ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 16జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.1,24,999. 5,060mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

వెనుక వైపు 50 ఎంపీ + 48 ఎంపీ + 48 ఎంపీ కెమెరాలతో పాటు ముందు వైపు 42 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ప్రో మొబైల్స్‌కు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది.

పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్‌ 

48 ఎంపీ ప్రధాన కెమెరా, 10.5 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 10.8 ఎంపీ టెలీఫొటో కెమెరా ఇచ్చారు. టెన్సార్‌ జీ4 చిప్‌సెట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

4,650mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 16జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.1,72,999.

ఫ్యూయల్‌పై రివార్డులందించే కార్డులివే..

వీళ్లు ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో తెలుసా?

మెటల్‌ మెరుపులు అద్దుకున్న క్రెడిట్‌ కార్డులివే

Eenadu.net Home