గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ.. ధర, ఫీచర్లివే..

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫోన్‌ భారత్‌లోకి వచ్చేసింది. దీని ఫీచర్లు సహా ధరల వంటి వివరాలు చూద్దాం..

పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8ప్రో తరహాలోనే జెమిని, బెస్ట్ టేక్‌, ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

120Hz రిఫ్రెష్‌ రేటు, 2,000 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంది.

64MP ప్రధాన లెన్స్‌తో పాటు 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తో ప్రధాన కెమెరా. సెల్ఫీల కోసం 13MP కెమెరా అమర్చారు.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,404mAh బ్యాటరీ ఉంది. ఏడేళ్ల పాటు ఓఎస్‌, సెక్యూరిటీ, ఫీచర్‌ డ్రాప్‌ అప్‌డేట్లు ఇస్తారు.

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌; వైఫై 6, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ ఉన్నాయి.

8జీబీ + 128జీబీ ధర రూ.52,999; 8జీబీ + 256జీబీ ధర రూ.59,999గా ఉంది.

కొన్ని బ్యాంకు కార్డులపై రూ.4,000 క్యాష్‌బ్యాక్‌; రూ.9,000 ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ లభిస్తుంది. ముందుగా ఆర్డర్‌ చేసుకున్నవారికి రూ.999కే పిక్సెల్‌ ఏ-సిరీస్‌ బడ్స్‌ ఇస్తున్నారు.

అంతరిక్ష కేంద్రం.. ఆసక్తికర విషయాలు

గూగుల్‌ వాలెట్‌ ఎలా వాడాలి?

ఈ వాట్సప్‌ ఫీచర్ల గురించి తెలుసా?

Eenadu.net Home