గూగుల్‌ వాలెట్‌ ఎలా వాడాలి?

గూగుల్‌ వాలెట్‌ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇది ఒక డిజిటల్‌ వాలెట్‌ మాత్రమే. చెల్లింపులకు సంబంధించిన ఫీచర్లేవీ ఉండవు. 

This browser does not support the video element.

మూవీ టికెట్లు, గిఫ్ట్‌ కార్డులు, బోర్డింగ్‌ పాసుల వంటి వాటి ఈజీ స్టోరేజీ, యూసేజీ కోసం ఈ వాలెట్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం వివిధ కంపెనీలతో గూగుల్‌ జట్టు కట్టింది.

మూవీ టికెట్స్‌

సినిమా టికెట్లను వాలెట్‌లో భద్రపరుచుకునేందుకు పీవీఆర్‌, ఐనాక్స్‌తో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వేదికల ద్వారా కొనుగోలు చేసిన టికెట్లు వాలెట్‌లో ఆ యాప్‌ / సర్వీసు నుంచి కూడా యాడ్‌ చేసుకోవచ్చు.  

బోర్డింగ్‌ పాస్‌

ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలతో పాటు మేక్‌మై ట్రిప్‌, ఇక్సిగో వంటి సంస్థలతో గూగుల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో విమానాశ్రయాల్లో గూగుల్‌ వాలెట్‌ను బోర్డింగ్‌ పాస్‌గానూ వినియోగించుకోవచ్చు.

గిఫ్ట్‌ కార్డులు

ఫ్లిప్‌కార్ట్‌, డామినోస్‌, షాపర్స్‌ స్టాప్‌ వంటి బ్రాండ్లు అందించే లాయల్టీ, గిఫ్ట్‌ కార్డులనూ గూగుల్‌ వాలెట్‌లో లోడ్‌ చేసుకోవచ్చు.

మెట్రో టికెట్లు

హైదరాబాద్‌, కోచి మెట్రోతో పాటు అబి బస్‌ వంటి కంపెనీలతో గూగుల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా టికెట్లను వాలెట్‌ ద్వారా కొనుగోలు చేసి సేవ్‌ చేసుకోవచ్చు.

మెయిల్‌కొచ్చే టికెట్లు

రైలు టికెట్లు, మూవీ టికెట్లకు సంబంధించిన సమాచారం ఒకవేళ మన మెయిల్‌కొస్తే ఆటోమేటిక్‌గా ఆ వివరాలు వాలెట్‌లో ప్రత్యక్షమవుతాయి.

ఫిజికల్‌ డాక్యుమెంట్లు

క్యూఆర్‌ కోడ్స్‌ కలిగిన బోర్డింగ్‌ పాస్‌, లగేజీ ట్యాగ్స్‌ వంటి ఫిజికల్‌ డాక్యుమెంట్లనూ పాస్‌ల రూపంలో వాలెట్‌లో లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

Eenadu.net Home