‘96’ జూనియర్‌ జాను.. ఇప్పుడు హీరోయిన్‌

ఈ అమ్మాయి పేరు తెలియకపోవచ్చు. కానీ, ‘96’లో జూనియర్‌ త్రిష అంటే మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేస్తారు.

image:Instagram/Gouri G Kishan

ఆ చిత్రాన్ని తెలుగులో ‘జాను’గా రీమేక్‌ చేయగా.. అందులోనూ సమంత టీనేజ్‌ పాత్రలో గౌరీనే నటించింది.

image:Instagram/Gouri G Kishan

ఆ చిన్నదే.. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

image:Instagram/Gouri G Kishan 

సంతోష్‌ శోభన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో గౌరీ పూర్తిస్థాయి హీరోయిన్‌గా కనిపించనుంది.

image:Instagram/Gouri G Kishan

తాజాగా ఈ బ్యూటీ బర్త్‌డే జరుపుకొంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఓ స్టిల్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

image:Instagram/Gouri G Kishan

కేరళలోని అదూర్‌లో 1999 ఆగస్టు 17న జన్మించిన ఈ అందాల భామ.. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ట్రిపుల్ మేజర్ (జర్నలిజం, సైకాలజీ, ఇంగ్లీష్)లో డిగ్రీ పూర్తి చేసింది.

image:Instagram/Gouri G Kishan

కోలీవుడ్‌లో ‘96’ తర్వాత ‘మార్గమ్‌కాలీ’తో మాలయాళ చిత్రసీమలో, ‘జాను’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

image:Instagram/Gouri G Kishan

తళపతి విజయ్‌ హీరోగా లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘మాస్టర్‌’లో కాలేజీ స్టూడెంట్‌గా మెరిసింది.

image:Instagram/Gouri G Kishan

‘పేపర్‌ రాకెట్‌’అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ తళుక్కుమంది.

image:Instagram/Gouri G Kishan

2021లో ధనుష్‌ కథానాయకుడిగా వచ్చిన ‘కర్ణన్‌’లోనూ నటించింది.

image:Instagram/Gouri G Kishan

 కుందనపు బొమ్మలాంటి ఈ అందాల భామకి కుర్రకారులో చాలా క్రేజ్‌ ఉంది.

image:Instagram/Gouri G Kishan

సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

image:Instagram/Gouri G Kishan

జీక్యూ అందాలు

అందాల రాశీ.. దిగంగన సూర్యవంశీ..!

ఆ సీన్లకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇవ్వాల్సిందే!

Eenadu.net Home