ఈ అలవాట్లు మీకు ఆరోగ్యాన్నిస్తాయి!
పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజూ 5 రకాల పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తినాలి. వీటి నుంచి లభించే పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయి.
Image: Eenadu
జీర్ణక్రియలు, జీవక్రియలు సాఫీగా జరగాలంటే నీళ్లు తాగడం చాలా అవసరం.
Image: Pixabay
ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి రోజూ వర్కవుట్లు చేయండి. దీని కోసం కనీసం ఓ గంటైనా కేటాయించాలి.
Image: Pixabay
శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. అంటే తగినన్ని గంటలు నిద్రపోవాలి. రోజులో కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.
Image: Eenadu
రోజులో దాదాపు 10,000 అడుగులు వేయడం వల్ల బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Image: Pixabay
ధ్యానం, యోగా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది.
Image: Pixabay
ఇంటా, బయటా పనులతో అలసిన మనసుకి సేద తీరాలంటే మీకు నచ్చిన పని కోసం రెండు గంటలు కేటాయించాలి. సంగీతం వినడం, గార్డెనింగ్ ఇలా ఏదైనా కావొచ్చు.
Image: Pixabay
రోజూ మీరు చేసిన పనుల మధ్య కనీసం నాలుగు స్వల్ప విరామాలు ఇస్తుండాలి.
Image: Pixabay