కురుల ఆరోగ్యాన్ని.. కాపాడుకోండిలా!

వారానికి రెండు సార్లు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. లేదంటే వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. 

 image:RKC

ప్రస్తుతం చాలామంది వెంట్రుకలకు నూనె పెట్టుకోవట్లేదు. కానీ తప్పనిసరిగా నూనె పెట్టుకోవాలి. ఓ పావుగంట సేపు మర్దన చేసుకోవాలి. దీంతో కురులు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తుగా పెరుగుతాయి. 

image:RKC

శీతాకాలంలో ఎక్కువగా చుండ్రు బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే.. యాంటీ డాండ్రఫ్‌ షాంపూలు వాడాలి. సమస్య మరింత ఎక్కువగా ఉంటే చర్మ వైద్యులను సంప్రదించాలి. 

image:RKC

వారానికోసారి హెయిర్‌ మాస్క్‌ వేసుకోవాలి. వీటిని ఎంచుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైన వాటినే ఉపయోగించాలి. 

image:RKC

తలస్నానం చేసిన వెంటనే దువ్వకూడదు. దీంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. పూర్తిగా ఆరిన తర్వాతే జట్టును దువ్వాలి. 

image:RKC

ఇంట్లో అందరూ ఒకే దువ్వెన వాడకూడదు. మీకంటూ ప్రత్యేకంగా ఓ దువ్వెన పెట్టుకోండి. వేరే ఊళ్లకు వెళ్లినా కూడా మీకు అవసరమయ్యే వాటిని వెంట తీసుకెళ్లాలి. 

image:RKC

తరచూ షాంపూలు మార్చకూడదు. రసాయనాలు ఎక్కువగా లేని షాంపూలను ఎంచుకోవాలి. 

image:RKC

విటమిన్‌ ఈ ఉండే బాదం, ఆలివ్‌ ఆయిల్‌తో వారానికోసారి మర్దన చేసుకోవాలి. దీంతో జుట్టు పట్టులా తయారవుతుంది. 

image:RKC

హెయిర్‌ స్టైల్‌ చేసుకునేందుకు హీట్‌ మిషన్స్‌ వాడుతుంటారు. ఇలా తరచూ చేస్తుండటం వల్ల కురులు నిర్జీవంగా తయారవుతాయి. 

image:RKC

హెయిర్‌ డ్రైయర్లను ఎక్కువగా ఉపయోగించకూడదు. కురులను సహజ పద్ధతిలోనే ఆరనివ్వాలి. లేదంటే కుదుళ్లు బలహీనమవుతాయి. 

image:RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home