తలకు నూనె పెట్టడం లేదా...?

చిన్నప్పటి నుంచి పెద్దలు తలకు నూనె పెట్టడం అందరికీ తెలిసిందే..మరి ఇందులో ఉండే ఫలితాలేవో తెలుసుకోండి..!

image:RKC

సాధ్యమయినంత వరకు రాత్రిపూట తలకు నూనె పెట్టి ఉదయం తల స్నానం చేయడంతో బలమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

image:RKC

మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ప్రతి నూనెను వాడేస్తే జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

image:RKC

తలకు చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను పెట్టడంతో జుట్టు తొందరగా తెల్లపడదు.

image:RKC

తలలో ఏర్పడే చుండ్రు, ఫంగస్‌ సమస్యలు రాకుండా పోతాయి. ఇతర వ్యాధులు రాకుండా ఉండేందుకు వీలు కలుగుతుంది.

image:RKC

తలకు నూనె పెట్టడంతో కాలుష్యంతో వచ్చే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అతి నీలలోహిత కిరణాలు తలపై నేరుగా పడకుండా ఉంటాయి.

image:RKC

తలకు కొబ్బరి నూనె పట్టించి వేడి నీటిలో ముంచి పిండిన తువ్వాలును చుట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోకుండా బలంగా తయారవుతాయి.

image:RKC

తలకు నూనె పెట్టిన తర్వాత స్నానం చేస్తే షాంపూలో కండిషనర్‌ ఉండే వాటిని వాడాలి. లేకపోతే జుట్టు దెబ్బతింటుంది.

image:RKC

రోజూ జుట్టుకు కొబ్బరి నూనె పెట్టడంతో వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలపై ఉండే చర్మంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.

image:RKC

తలకు పట్టించే నూనెను తరచుగా మార్చొద్దు. ఎలాంటి ఇతర మిశ్రమాలు లేకుండా ఉండే వాటిని వాడితే బాగుంటుంది.

image:RKC

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home