పెళ్లి పీటలెక్కనున్న హన్సిక మోత్వానీ

తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న హన్సిక మోత్వానీ వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Image:Instagram/Hansika Motwani

తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నానని వెల్లడించింది.

Image:Instagram/Hansika Motwani

పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ ముందు తనకు సోహైల్‌ ప్రపోజ్‌ చేసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఈ ప్రేమ ఇప్పుడూ.. ఎప్పటికీ..’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమెకి అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Image:Instagram/Hansika Motwani

హన్సిక వివాహం రాజస్థాన్‌ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన కోటలో జరగనుంది.

Image:Instagram/Hansika Motwani

ప్రస్తుతం ‘బోగన్‌’,‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీమె!

Image:Instagram/Hansika Motwani

హన్సిక 1991 ఆగస్టు 9న ముంబయిలో పుట్టింది. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించింది.

Image:Instagram/Hansika Motwani

బాలనటిగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి చాలా సీరియల్స్‌లో అలరించింది.

Image:Instagram/Hansika Motwani

‘దేశముదురు’లో అల్లు అర్జున్‌ సరసర నటించింది హన్సిక. ఈ సినిమాతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకొంది.

Image:Instagram/Hansika Motwani

‘కందిరీగ’, ‘మస్కా’, ‘కంత్రి’, ‘దేశముదురు’ హన్సికకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Image:Instagram/Hansika Motwani

వీలు చిక్కినప్పుడల్లా బీచ్‌ ప్రాంతాలకు వెళ్తుంటుంది హన్సిక. Image:Instagram/Hansika Motwani

ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ప్రపంచాన్నంతా చుట్టి రావాలన్నది ఆమె కోరిక.

Image:Instagram/Hansika Motwani

ఈ భామ గొప్ప మానవతావాది కూడా. చాలామంది పిల్లల్ని దత్తత తీసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

Image:Instagram/Hansika Motwani

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home