హ్యాపీ బర్త్‌డే కావ్య థాపర్‌..

కావ్య థాపర్‌.. ఈ పేరు విన్నారా.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసింది. ఆగస్టు 20న ఈ భామ పుట్టినరోజు ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు..

(photos:instagram/kavyathapar20)

ప్రస్తుతం ‘ఊరు పేరు భైరవ కోన’లో సందీప్‌ కిషన్‌ సరసన వర్షబొల్లమ్మతో పాటు తెరను పంచుకుంది.. కావ్య. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాకి ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

ఇటీవల ‘బిచ్చగాడు 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కావ్య. ఈ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సుందరి ముంబయి (1995)లో పుట్టింది. చదువంతా అక్కడే సాగింది. డిగ్రీ పట్టా అందుకున్నాక నటనపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా తన కెరియర్‌ని మొదలుపెట్టింది.

బాలీవుడ్‌లో 2013లో ‘తత్కాల్‌’ అనే షార్ట్‌ ఫిలిమ్‌తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

దాని తర్వాత కొన్ని బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది.. కానీ సినిమా అవకాశాలేవీ రాలేదు.. 2018లో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

‘మార్కెట్‌ రాజా ఎం.బి.బి.ఎస్‌’, ‘ఏక్‌ మినీ కథ’, ‘మిడిల్‌ క్లాస్‌ లవ్‌’, తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. 

ఈ బ్యూటీ కెరియర్‌ని మలుపు తిప్పే మంచి హిట్‌ కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రవితేజ సరసన ‘ఈగల్‌’ షూటింగ్‌లో బిజీగా ఉంది. దీనికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈమెతో పాటు అనుపమ పరమేశ్వరన్‌ తెరను పంచుకోనుంది. ఇందులో తన పాత్ర భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందంటుందీ ముంబయి బ్యూటీ..

ఈ భామ సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో 1.1 మిలియన్‌ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలు పోస్టు చేస్తూ యువతను కట్టిపడేస్తోంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home