సారా.. బాలీవుడ్ సితార
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘కేధార్‌నాథ్(2018)’తో తెరంగేట్రం చేసింది.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఈమె అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె.
ఇటీవల ‘జర హట్కే జర బచ్కే’ చిత్రంతో హిట్ అందుకున్న సారా.. ఈ ఆగస్టు 12న తన పుట్టిన రోజును తల్లి అమృత సింగ్ సమక్షంలో జరుపుకొంది.
ఈ సుందరి పుట్టి పెరిగింది ముంబయిలో. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీపట్టా అందుకుంది. నాలుగేళ్లప్పుడే టీవీ యాడ్‌లో నటించింది.
మోడలింగ్‌తోనే తన కెరియర్ మొదలుపెట్టిందీ భామ. 23 ఏళ్లప్పుడు ‘కేధార్‌నాథ్’తో చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’, ‘కూలీ నెం 1’, ‘అత్రంగీ రే’ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. రణ్‌వీర్ సింగ్, ఆలియా నటించిన ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’లోని ఓ పాటలో మెరిసింది.
ఈ మధ్యనే పవన్ కిర్‌పళని దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాస్ లైట్’ ఈమెకు మంచి గుర్తింపు నిచ్చింది. ఇందులో విక్రాంత్ మెస్సీ, చిత్రంగద సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సుందరికి టెన్నిస్ అంటే చాలా ఇష్టమట. తన తండ్రి సైఫ్‌అలీఖాన్, తమ్ముడితో కలిసి ఆడడం ఇంకా నచ్చుతుందట.
This browser does not support the video element.
అమెరికాలో చదువుకుంటున్నప్పుడు సారా అమాంతంగా 96 కేజీల బరువు పెరిగిందట. తన చదువు పూర్తయిన తర్వాత జిమ్‌లో చేరి వర్కౌట్లతో తన శరీర ఆకృతిని తిరిగి మార్చుకుందట. అదే డైట్‌ని ఇప్పటికీ ఫాలో అవుతుంది.
ఈ బ్యూటీకి లండన్, దుబాయ్, గోవా, న్యూయార్క్ ట్రిప్పులకి వెళ్లాడమంటే చాలా ఇష్టమట. ఫుడ్ విషయానికొస్తే.. హైదరాబాదీ బిర్యానీ బాగా నచ్చుతుందట.
ఈ భామ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈమె నటిస్తోన్న ‘మర్డర్ ముబారక్’, ‘ఏ వతన్ మేరే వతన్’, ‘మెట్రో ఇన్ డినో’ సహా మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.