హ్యాపీ బర్త్ డే టూ.. సూపర్ స్టార్ ‘రజనీకాంత్’
సుమారు 160 చిత్రాలు చేసిన విలక్షణ నటుడు.. పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదా ఫాల్కే అవార్డుల గ్రహీత సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయన ఫేమస్ డైలాగ్స్ మీకోసం..
image:RKC
అతి తెలివివాళ్లు సుఖంగా జీవించిందీ లేదు. తెలివి తక్కువ వాళ్లు అడుగంటి పోయిందీ లేదు.
image:RKC
న్యాయానికి బంధం, బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు.. తప్పు చేసిన వాడు శత్రువు.
image:RKC
పొగిడేవాడు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టూ కాదు.
image:RKC
మీసం వచ్చినవాడల్లా మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో చిల్లి గవ్వకూడా తాకకుండా తను కష్టపడి వాళ్లకు ఎవడైతే తిండిపెడతాడో వాడే అసలైన మగాడు.
image:RKC
తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకుని చచ్చిపోయేవాడు మూర్ఖుడు.
image:RKC
ఎవరైనా మనకి సహాయం చేస్తే తిరిగి వాళ్లకి నలుగురి ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువారి సంప్రదాయం.
image:RKC
తెలుగు చిత్రాల్లో.. ఇక్కడ గాటు పెట్టుకొని మీసాలు మెలితిప్పుకొని లుంగీ కట్టుకుని పాత విలన్లు హే కబాలి అని పిలవగానే వంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతారే ఆ కబాలి అనుకున్నారా! కబాలిరా..
image:RKC
మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు.. కానీ ఓడిపోతాడు.
image:RKC
ఒకటి గుర్తు పెట్టుకో.. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు.
image:RKC
డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి. అంతేకానీ.. కొమ్ములు రాకూడదు.
image:RKC
చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ.. జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది.
image:RKC
అతిగా ఆశ పడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు.
image:RKC
ఈ భాషా ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు లెక్క..!
image:RKC
నాన్న.. పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది.
image:RKC