వేటిని ఫ్రిడ్జ్‌లో ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదో తెలుసా!

ప్రస్తుతం చాలా మంది ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తున్నవే వాడుతున్నారు. సూపర్‌ మార్కెట్లోనూ అలా స్టోర్‌ చేసినవే కొంటున్నారు. దీంతో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్న మాటే కానీ.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. మరి ఎక్కువకాలం పాటు వేటిని నిల్వ చేయకూడదో చూద్దాం.

image:RKC

బ్రోకలిలో ఎక్కువగా ఫంగస్‌ చేరేందుకు అవకాశముంటుంది. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం ద్వారా అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. రుచి కూడా ఉండదు. 

image:RKC

ఆకుకూరలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఐస్‌ ట్రేలను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లను మనం పొందలేం. అందువల్ల ఆకుకూరలను తాజాగా ఉన్నప్పుడే వండుకోవాలి. image:RKC

పేస్ట్రీలు, డజర్ట్స్‌ను ఫ్రిడ్జ్‌లోనే స్టోర్‌ చేస్తూంటాం. కానీ ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల ఇవి విషతల్యమవుతాయి. అందుకే ఎప్పటివి అప్పుడు తినేయండి!

image:RKC

బ్రెడ్‌ తినాలంటే తాజాగా తినడమే ఉత్తమం. రోజుల పాటుగా ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని సహజగుణాన్ని, రుచిని కోల్పోతాయి.

image:RKC

మిగిలిన అన్నం, కూరలు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచకూడదు. ఇలా నిల్వ చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరానికి సరైన శక్తి లభించదు.

image:RKC

ఒకవేళ మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయాల్సి వస్తే గంటల వ్యవధిలోనే తినేలా చూసుకోండి. image:RKC

ఓపెన్‌ చేసి సగం తాగేసిన కూల్‌డ్రింక్‌లను మళ్లీ ఫ్రిడ్జిలోనే పెట్టి తాగుతుంటారు. ఇలా చేయకూడదు. ఒకసారి ఓపెన్‌ చేసిన కూల్‌డ్రింక్ వెంటనే తాగేయండి!

image:RKC

ఎక్కువ చల్లగా ఉన్న నీళ్లను తాగడం అనారోగ్యానికి దారి తీస్తుంది. వీలైనంత వరకు మట్టి కుండలో నీళ్లు తాగటం ఉత్తమం.

image:RKC

ఉద్యోగరీత్యా వంట చేసుకునే సమయం లేక ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఆహారం సిద్ధం చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీంతో ఆరోగ్య సమస్యలూ అధికమవుతాయి. 

image:RKC

కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

మందులు వేసుకుంటున్నారా? అయితే ఈ ఆహారం తినొద్దు!

క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించండిలా!

Eenadu.net Home