మెరుగైన జీవితానికి 80/20 సూత్రం..

మెరుగైన జీవితం సొంతం కావాలంటే.. 80/20 సూత్రాన్ని పాటించాలని చెబుతున్నారు.. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా. అదేంటంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే.. మన దృష్టి 80శాతం తినే ఆహారంపై, 20శాతం వ్యాయామంపై ఉండాలి.

సంపద సృష్టించాలంటే.. 80శాతం అలవాట్లు, 20శాతం జ్ఞానం ఉపయోగించాలి.

మాటామంతి విషయంలో.. 80శాతం వినాలి, 20శాతమే మాట్లాడాలి

నేర్చుకోవాలంటే.. 80శాతం అర్థం చేసుకోవాలి, 20శాతం చదవాలి.

విజయంలో.. 80శాతం పాత్ర చర్యలవి, 20శాతం ప్రణాళికదై ఉండాలి.

సంతోషంలో.. 80 శాతం అర్థం ఉండాలి, 20శాతం సంతృప్తి కలగాలి.

బంధం బలపడాలంటే.. 80శాతం ఇవ్వాలి, 20శాతం స్వీకరించాలి.

ఎదగాలంటే.. 80శాతం పట్టుదల, 20శాతం ఆలోచనలు ఉండాలి.

క్రెడిట్‌ స్కోరు పెంచే 8 టిప్స్‌

యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను చూడాలంటే ఇలా చేయండి..

ఫ్రీడమ్‌ 125.. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌

Eenadu.net Home