టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్ విశేషాలు!
క్రికెట్‌లో.. హ్యాట్రిక్ వికెట్లు తీయడం చాలా కష్టం. అలాంటిది న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ రెండోసారి టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.
Image:RKC
నవంబర్ 20న భారత్‌తో జరిగిన రెండో టీ20లో చివరి ఓవర్లో టిమ్ సౌథీ వరుసగా హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.
Image:RKC
అంతకుముందు 2010 డిసెంబర్ 26న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరస బంతుల్లో యూనిస్ ఖాన్, మహ్మద్ హఫీజ్, ఉమర్ అక్మల్ వికెట్లు పడగొట్టాడు సౌథీ.
Image:Instagram
ఇలా రెండుసార్లు హ్యాట్రిక్ తీసిన మరో బౌలర్ ఉన్నాడు. అతనే శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ. 2017 ఏప్రిల్ 6న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరసగా ముష్ఫికర్ రహీమ్, మోర్తాజా, మెహెదీ హసన్‌ను పెవిలియన్ పంపించాడు.
Image:RKC
ఆ తర్వాత 2019లో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య టీ20 జరిగింది. అందులో మలింగ.. ఏకంగా నలుగురిని(మున్రో, రుథర్‌ఫోర్డ్, గ్రాండ్‌హోం, రాస్ టేలర్)ఔట్ చేశాడు.
Image:RKC
తొలి హ్యాట్రిక్ 2007 సెప్టెంబర్ 16న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రికార్డు అయింది. ఆసీస్ బౌలర్ బ్రెట్ లీ.. షకీబ్ అల్ హసన్, మోర్తాజా, అలోక్ కపాలిని ఔట్ చేసి ఈ రికార్డు సృష్టించాడు.
Image:RKC
మొత్తంగా శ్రీలంక 5, న్యూజిలాండ్ 4, ఆస్ట్రేలియా 3 సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీయగా.. బెల్జియం, ఐర్లాండ్, పాకిస్థాన్ రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీశాయి. భారత్, అప్ఘానిస్థాన్ సహా క్రికెట్ ఆడే మరో 22 దేశాల జట్లు తలో హ్యాట్రిక్ సాధించాయి.
Image:Twitter
భారత్ తరఫున ఈ రికార్డు సాధించిన బౌలర్ దీపక్ చాహర్. 2019 నవంబర్ 10న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాఫుల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రహ్మాన్, అమినుల్ ఇస్లాం వికెట్లు తీశాడు.
Image:Instagram
అత్యుత్తమ ఎకానమీతో హ్యాట్రిక్ తీసిన బౌలర్.. చమల్ సుడాన్. ఈ ఏడాదే ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో సైప్రస్, టర్కీ తలపడ్డాయి. సైప్రస్ బౌలర్ సుడాన్.. 1.3 ఓవర్లు వేసి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Image:Twitter