అవకాడో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?


100 గ్రాముల అవకాడో పండు గుజ్జు తింటే 160 కిలో కెలొరీల శక్తి వస్తుంది.

Image:Pixabay

ఎ, బి, ఇ విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు సమృద్ధిగా పొటాషియం, పీచు పదార్థం, ఖనిజాలు ఉంటాయి.

Image:Pixabay

ఈ పండు తినడం వల్ల గుండెకు, చర్మానికి మంచిది. ఇన్సులిన్‌ ఉత్పత్తి సమన్వయం అవుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Image:Pixabay

అవకాడో పండ్లలో సులభంగా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సగం ముక్కలో దాదాపు 7 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది.

Image:Pixabay

కెలొరీలు, ఆరోగ్యవంతమైన కొవ్వు అధికంగా ఉండటం వల్ల సహజ సిద్ధంగా బరువు పెరగాలనుకునే వారికి అవకాడో ఉపయోగపడుతుంది.

Image:Pixabay

అవకాడోలో అవకాటిన్‌ బి అనే కొవ్వు అణువులుంటాయి. దీనికి అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా (ఏఎంఎల్‌) అనే తీవ్ర రక్తక్యాన్సర్‌ కణాలను అడ్డుకునే గుణం ఉంది.

Image:Pixabay

కురులకు అవసరమైన ‘ఇ’, ‘బి’ విటమిన్లు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలను మాశ్చరైజింగ్‌ చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image:Pixabay

దీంట్లో కంటిచూపునకు అవసరమైన బీటాకెరోటిన్‌ కూడా మంచి మోతాదులో ఉంటుంది.

Image:Pixabay 

వీటిలో లభించే ఎ విటమిన్‌ వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తుంది.

Image:Pixabay

తీపి తినాలన్న కోరిక ఇందుకేనట..!

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

Eenadu.net Home