చామదుంప..ప్రయోజనాలు బోలెడంతా..!
చామదుంప జిగురుగా ఉంటుందని చాలా మంది తినడానికి వెనకడుగు వేస్తారు. కానీ, దీనిలో ఎన్నో ఆరోగ్య ఫలాలు ఉన్నాయి.
Image:RKC
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చామ మంచి ఆహారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
Image:RKC
క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే ఆహారంగా నిలిచింది ఇది. దీంట్లో తక్కువ కెలోరీలుంటాయి. బరువు కూడా పెరగరు.
Image:RKC
అజీర్తి, హైపర్ టెన్షన్, కండరాల బలహీనతలను తగ్గించడానికి మంచి ఔషధంగా పని చేస్తుంది.ఇతర దుంపలలాగా తినగానే గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరగవు. చాలా నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది.
Image:RKC
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారు నిరభ్యంతరంగా భుజించవచ్చు. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Image:RKC
అధిక బరువును తగ్గించుకోవాలనుకునేవారు దీనిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంట్లో ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
Image:RKC
దృష్టి లోపాలను తగ్గించడంతో పాటు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మోనోపాజ్‌లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
Image:RKC
పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మదిస్తుందని పలు పరిశోధనాల్లో తేలింది.
Image:RKC
చామగడ్డలోని డయోస్టెనిన్ అనే పదార్థం కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది.
Image:RKC