కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

కొత్తిమీర అనగానే మంచి వంటకం మీద అలంకరించడానికి వినియోగించే ఆకుకూరగా భావిస్తాం.. కానీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

Image: RKC

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను బయటకు పంపి.. కొవ్వును కరిగిస్తాయి. 

Image: RKC

మొహంపై ఏర్పడే మొటిమలు, పొడి చర్మం, నల్లమచ్చలను కొత్తిమీర తగ్గిస్తుంది.

Image: RKC

ఇందులోని నూనె పదార్థాలు తలనొప్పి, మానసిక అలసట, ఆందోళన రాకుండా చేస్తాయి. 

Image: RKC

ఎముకలు బలంగా మారడానికి దోహదం చేసే విటమిన్‌ కె కొత్తిమీరలో పుష్కలంగా లభిస్తుంది. జింకు, కాపర్‌, పొటాషియం కూడా ఇందులో ఉంటాయి.

Image: RKC

కొత్తిమీర ఆకులు రుచిగా ఉండటమే కాదు.. జీర్ణక్రియను పెంచుతాయి. జీర్ణకోశంలో ఏర్పడే జబ్బుల నుంచి రక్షిస్తాయి.

Image: RKC

మధుమేహం తగ్గించడంలో కొత్తిమీర చాలా కీలకంగా పని చేస్తుంది. ఇన్సులిన్‌ తయారీని పెంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

Image: RKC

మూత్రనాళ సంబంధ వ్యాధులు రాకుండా చూడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది.

Image: RKC

కొత్తిమీరలో ఐరన్‌ అధికంగా ఉండటం వల్ల శరీరంలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది. మహిళలకు రక్తహీనత రాకుండా చూస్తుంది.

Image: RKC

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home